ఓయో రూమ్‌లో దారుణం
ఉపాధ్యాయుడి అనుమానాస్పద మృతి
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 26 (విజయక్రాంతి) : మదీనగూడలోని ఓయో లాడ్జీలో ఆదివారం దారుణం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఓయో రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన వ్యక్తిని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జయప్రకాశ్(35)గా గుర్తించారు. జయప్రకాశ్ ప్రస్తుతం రాయచోటిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడని తెలిపారు.
కాగా, గత కొన్ని రోజులుగా కూకట్‌పల్లిలోని బాలాజీనగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడని పేర్కొన్నారు. జయ ప్రకాశ్‌ది హత్యా? లేక ఆత్మహత్యా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. జయప్రకాశ్‌కు ఇంకా వివాహం కాలేదని, ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.






