ఘనంగా బోనాల ఊరేగింపు
27-05-2024 01:04 AM
కామారెడ్డి, మే 26 (విజయక్రాంతి) : జిల్లాలో ఘనంగా బోనాల పండుగను పలు గ్రామాలలో నిర్వహించారు. ఆదివారం పి ట్లం మండలం ధర్మారం గ్రామంలో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించారు. గ్రామస్తులు బ్యాండ్ మేళాలతో శివసత్తుల నృత్యాలతో ఊరేగింపుగా మహంకాళి ఆలయానికి బోనాలతో తరలివచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. బాన్సువాడ, ఎల్లారెడ్డి, కామారెడ్డి, దోమకొండ, బీబీపేట్ మండలాల్లోనూ బోనాల పండుగ వైభవంగా జరుపుకున్నారు.
లింగాపురంలో వెంకన్న స్వామి కల్యాణం
కామారెడ్డి పట్టణం లింగాపూర్ గ్రామం లో భూలక్ష్మి, వేంకటేశ్వర స్వామి కల్యాణం ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు కొమిరెడ్డి పెద్ద నారాయణ, ఆంజనేయులు పాల్గొన్నారు.






