30 May, 2026 | 2:48 AM

బీసీ జాగృతి సేన జిల్లా అధ్యక్షుడుగా శేఖర్ యాదవ్

30-05-2026 12:00 AM

రాజాపూర్ మే 29: మండలం ఈద్గాన్ పల్లి గ్రామ వాసి జెనిగల శేఖర్ యాదవ్ ను బీసీ జాగృతి సేన జిల్లా అధ్యక్షులుగా నియమిస్తూ  నియామకం పత్రంను బీసీ దళపతి రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య  జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షుడు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ శుక్రవారం నియామక పత్రం అందజేశారు.

ఈ సందర్బంగా శేఖర్ యాదవ్ మాట్లాడుతూ  జిల్లా వ్యాప్తంగా గ్రామ, మండల కమిటీల నిర్మాణం పూర్తి చేసి గ్రామాలలో బీసీ చైతన్య సదస్సు లు నిర్వహిస్థామని, చట్ట సభలలో రిజర్వేషన్ ల సాధనే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం లో బీసీ జాగృతి సేన రాష్ట్ర ఉపాధ్యక్షడు వెంకటేష్ యాదవ్, జడ్చర్ల మండల అధ్యక్షులు గొడుగు నర్సిములు, గంగపుత్ర వీరేష్  తదితరులు పాల్గొన్నారు.