30 May, 2026 | 2:47 AM

బడిబాటపై పాటల సీడీ ఆవిష్కరణ

30-05-2026 12:00 AM

కలెక్టర్ ఖుష్బూ గుప్తా

మహబూబ్ నగర్ మే 29 :  బడిబాట పై పాటల తో పూర్తిస్థాయిలో ప్రచారం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయాలని జిల్లా కలెక్టర్  ఖుష్బూ గుప్తా అన్నారు.  ప్రభుత్వ ఉపాధ్యాయులు తిరుమల నాగేంద్ర కుమార్ రచించిన  బడిబాట పాటల సిడి ని జిల్లా కలెక్టర్  ఖుష్బూ గుప్తా,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం తన ఛాంబర్ లో ఆవిష్కరణ చేశారు. ఈ సీడీ పాటలను ఆవిష్కరించారు.