08-12-2025 08:00:26 PM
కాగజ్‌నగర్ (విజయక్రాంతి): పట్టణంలోని జిల్లా పరిషత్ హై స్కూల్‌లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు జోనల్ స్థాయి అండర్-14 బాక్సింగ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను కాగజ్‌నగర్ రూరల్ సీఐ కే. కుమారస్వామి, రూరల్ ఎస్‌ఐ సందీప్‌కుమార్ ప్రారంభించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన అండర్-14 విభాగంలో విక్రమ్ తేజ 28–30 కిలోల వర్గంలో గోల్డ్ మెడల్ సాధించి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాడు.
అలాగే అండర్-19 విభాగంలో సుమిత్ తివారి 63–67 కిలోల వర్గంలో గోల్డ్, అంకిత్ 57–60 కిలోల వర్గంలో గోల్డ్, ప్రభాత్ 69–75 కిలోల వర్గంలో గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత పొందారు. త్వరలో వరంగల్‌లో జరగనున్న రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీలలో వీరు పాల్గొంటారని ఎస్‌జిఎఫ్ సెక్రటరీ వెంకటేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షులు వేమూర్ల మధు, సెక్రటరీ మధురై శేఖర్, జెడ్పీఎస్ పీడీ ఇంద్ర, సీనియర్ పీడీ సంభాషరావు, సీనియర్ బాక్సర్లు సాయి, శివ, వంశీ తదితరులు పాల్గొన్నారు.