23 July, 2026 | 6:01 AM

క్రీడలతో ఆత్మవిశాసం పెరుగుతుంది: విప్ ఆది శ్రీనివాస్

01-06-2024 01:50 AM

రాజన్న సిరిసిల్ల, మే31(విజయక్రాంతి): క్రీడల దారా ఆత్మవిశాసం పెంపొందుతుందని ప్రభుత విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఇంటర్నేషనల్ మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధర్యంలో అయోధ్యలో నిరహిస్తున్న అథ్లెటిక్స్‌కు ఎంపికైన ఉమ్మడి కరీంనగర్ క్రీడాకారులను ఆయన అభినందించారు. వేముల వాడ నుంచి వారి ప్రయాణాన్ని శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి 40 మంది క్రీడాకారులు ఎంపికవడం గర్వంగా ఉన్నదని అన్నారు. పోటీల్లో విజయం సాధించి మన ప్రాంతానికి పేరు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ బింగి మహేశ్, నాయకులు రాకేశ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు