23 July, 2026 | 7:04 AM

యాదాద్రి పవర్ ప్లాంట్ దొంగల అరెస్ట్

01-06-2024 01:47 AM

రూ. 1.49 కోట్ల విలువైన చోరీ చేసిన పరికరాలు స్వాధీనం

యూపీ, నల్లగొండ జిల్లాకు చెందిన 11మంది రిమాండ్

మునుగోడు, మే 31: నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలో యాదాద్రి పవర్ ప్రాజెక్ట్ పరికరాలు దోపిడీ చేసిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు.  ప్రాజెక్ట్ ప్రాంతం లో ఏడాదిన్నర కాలంగా వివిధ పరికరాలు చోరీచేసినట్టు పోలీసులు గుర్తించారు. రూ.1.49కోట్ల విలువైన ౪ జీఐ  బండిల్స్, రూ.58 లక్షలు, కారు, ౨  బైకులు, ఒక ఆటో ను స్వాధీనం చేసుకున్నారు. ప్రాజెక్టు పరిసరాలలో నిల్వచేసిన పరికరాలు చోరీకి గురవుతున్నట్లు నిర్మాణ సంస్థలు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు షేక్ మహమ్మద్, షేక్ మునీర్, కంబాల అశోక్ , షేక్ రజాక్, మహమ్మద్ అప్రోజ్, మహమ్మద్ జానీ, మంద శ్రీను, మంద మహేష్, మంద నాగేంద్రబాబు, అమిత్ కుమార్ భరద్వాజ్, రవీంద్ర ప్రసాద్‌ను అరెస్టు చేశారు.

కాగా, మిర్యాలగూడకు చెందిన మహమ్మద్, మునీర్, అశోక్, మహేష్, జానీ, రజాక్ ఒక ముఠాగా ఏర్పడి,  దామరచర్లకు చెందిన ఆఫ్రోజ్,  నాగేంద్రబాబు,  శ్రీనులతో కలిసి వైటీపీఎస్ సంస్థ లో సెక్యూరిటీ గార్డులు రవి, రాంబాబు, యాకూబ్,  యూపీకి చెందిన సూపర్వైజర్ రంజిత్, క్రేన్ ఆపరేటర్  రవీందర్ సహకారంతో పరికరాలు దొంగిలించి, డీసీఎంలో ముషీరాబాద్‌కు చెందిన షర్ఫోద్దీన్ వద్దకు తరలించి విక్రయించినట్టు విచారణలో తేలింది.  కేసును ఛేదించిన మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు, మిర్యాలగూడ రూరల్ సీఐ వీరబాబు, వాడపల్లి ఎస్త్స్ర రవి , వేములపల్లి ఎస్త్స్ర విజయ్ కుమార్, మాడుగులపల్లి ఎస్త్స్ర శోభన్ బాబు, సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ విష్ణును ఎస్పీ చందనా దీప్తి  అభినందించారు.