కొల్లాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రమ్య
కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా వనిత
నాగర్‌కర్నూల్/కామారెడ్డి, మే 31 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక శుక్రవారం ఏకగ్రీవం అయ్యింది. ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డిల సమక్షంలో 6వ వార్డు కౌన్సిలర్ మేకల రమ్యను చైర్‌పర్సన్‌గా 17 మంది కౌన్సిలర్‌లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మరో ఐదుగురు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కార్యక్రమానికి గైర్హాజరు అయ్యారు. ఈ సందర్బంగా నూతన చైర్‌పర్సన్ రమ్య మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. కొల్లాపూర్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని చెప్పారు. కామారెడ్డి మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్‌గా 10వ వార్డు కౌన్సిలర్ ఉరుదొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత నెల 15న వైస్ చైర్‌పర్సన్ గడ్డం ఇందుప్రియ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన నేపథ్యంలో ఆ పోస్ట్ ఖాళీ అయ్యింది. మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఆర్డీవో రంగనాథ్‌రావు అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికలో దేవునిపల్లికి చెందిన 10వ వార్డు కౌన్సిలర్ ఉరుదొండ వనిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అనంతరం ఆమె బాధ్యతలను స్వీకరించారు. అనంతరం పలువురు ఆమెను సన్మానించారు.






