01-02-2026 01:19:26 AM
‘పుష్ప2’తో దేశవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నారు అల్లు అర్జున్. మాస్ ఇమేజ్‌ను పాన్- ఇండియా స్థాయిలో మరింత బలంగా చేసిన ఈ సినిమా తర్వాత బన్నీ చేసే ప్రతి ప్రాజెక్టుపై భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ రూ పొందుతున్న భారీ పాన్-ఇండియా సినిమాలో నటిస్తున్నారు. హై ఎనర్జీ యాక్షన్, గట్టి ఎమోషన్, కమర్షియల్ టచ్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా బన్నీ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలుస్తుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినవస్తోంది.
అట్లీ ప్రాజెక్ట్ పూర్తయ్యాక అల్లు అర్జున్ పూర్తిగా డిఫరెంట్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని ప్లాన్ చేస్తున్నాడట. అదే క్రమంలో ఇప్పటికే అధికారికంగా ప్రకటించిన అల్లు అర్జున్ కనగరాజ్ కాంబో మూవీ ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో రూపొందనుండగా, యాక్షన్‌తోపాటు ఎమోషనల్ డెప్త్ కూడా బలంగా ఉండనుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ ఈ ప్రాజెక్టును అత్యంత భారీ ప్రమాణాలతో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎంపికపై తాజాగా ఆసక్తికరమైన ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రద్ధా కపూర్‌ను కథానాయికగా తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని సమాచారం. పాన్-ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాలో నటీనటుల ఎంపిక చాలా జాగ్రత్తగా జరుగుతోందని తెలుస్తోంది. అందుకే శ్రద్ధా పేరు పరిశీలనలోకి వచ్చిందని సమాచారం.
ప్రభాస్‌తో ‘సాహో’లో నటించడం ద్వారా తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్ధా.. ఇటీవల ‘స్త్రీ2’ చిత్రంతో విమర్శకుల ప్రశంసలు, అవార్డులు అందుకుంది. ఆ సినిమా తర్వాత ఆమె చేసే ప్రతి ప్రాజెక్టుపై అటు ఉత్తరాదితోపాటు ఇటు దక్షిణాదిన ఆసక్తి పెరిగింది. ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి పాన్-ఇండియా స్టార్‌తో, లోకేశ్ కనగరాజ్ లాంటి క్రేజీ దర్శకుడితో సినిమా అంటే శ్రద్ధా కపూర్ కెరీర్‌లో కూడా ఇది ఒక కీలక మలుపు అవుతుందని అంతా అభిప్రాయపడుతున్నారు.