01-11-2025 05:53:18 PM
మోతే (విజయక్రాంతి): శనివారం ఇందిరమ్మ కాలనీ, అంబేద్కర్ నగర్, శ్రీ రామ్ నగర్, కోర్టు నందు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని స్వగ్రామం మండల పరిధిలోని రాఘవపురం ఎక్స్ రోడ్ గ్రామంలో గల గణేష్ హోటల్లో సీనియర్ న్యాయవాది పొదిళ్ల ప్రదీప్ కుమార్ జన్మదినం సందర్భంగా గ్రామ నాయకులు కార్యకర్తలు అందరు కలిసి గజమాలతో సత్కరించి కేక్ కట్ చేపించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం జన్మదిన వేడుక సందర్భంగా సీనియర్ న్యాయవాది పొదిల్ల ప్రదీప్ కుమార్ 50 మంది స్వాములకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉదయ్, సామ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి మద్ది మధుసూదన్ రెడ్డి, మాజీ సర్పంచులు మూడు కృష్ణ, మామిడి నాగార్జున స్వాతి, గుండాల గంగులు, బోర్రాజు మల్లయ్య యాదవ్, బత్తిని కనకయ్య గౌడ్, పాలకూరి సైదులు గౌడ్, గుండాల సైదులు యాదవ్, బొడ్డు వెంకట్, కోళ్ల రవీందర్ గౌడ్, కోళ్ల రవి, రాఖి, ఎల్లా చారి తదితరులు పాల్గొన్నారు.