calender_icon.png 2 November, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేగుంటలో అమానవీయ ఘటన... చితిలోంచి శవాన్ని బయటపడేసిన దుండగులు

01-11-2025 05:55:38 PM

చేగుంట: మెదక్ జిల్లా చేగుంట పట్టణంకి చెందిన కర్రె నాగమణి (70)  వృద్ధురాలు నిన్న ఉదయం చనిపోగా చేగుంటలోని వైకుంఠధామంలో అంతిమ సంస్కారాలు వారి కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఈరోజు ఉదయం అంతిమ సంస్కారాల కార్యక్రమంలో భాగంగా వారి కుటుంబ సభ్యులు వైకుంఠధామం వెళ్లి చూడగా సగం కాలిన శవం పై,చితిపై నీళ్లు పోసి శవాన్ని దుండగులు బయట పదవేశారు. మొన్న చనిపోయిన పక్కన ఉన్న చితిలోని శతాధిక వృద్ధురాలు మురాడి నర్సమ్మ తల భాగం లో చితాభస్మం మొత్తం దుండగులు ఎత్తుకెళ్లారు. ఈ చర్యల పట్ల చేగుంట గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.చేగుంట ఎస్. ఐ చైతన్యరెడ్డి  ఆదేశానుసారం  చేగుంట పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసు వారు దుండగులను పట్టుకొని వారిపై కఠిన చర్యలు తీసుకొని,భవిష్యత్తులో మరే  కుటుంబానికి ఇలా జరగకుండా చూడాలని గ్రామస్థులు కోరుకుంటున్నారు.