29 August, 2026 | 8:19 PM

అసత్య ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు

29-08-2026 06:45 PM

కోదాడ కాంగ్రెస్ పార్టీ నాయకుల హెచ్చరిక

కోదాడ,(విజయక్రాంతి): స్థాయి మరచి వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోదాడ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు హెచ్చరించారు. శనివారం కోదాడ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అల్సకాని శరభేశ్వరరావు మాట్లాడుతూ వ్యక్తిగతంగా దైవ పూజలు చేసుకుంటే సీఎం పదవి కోసం క్షుద్ర పూజలు అంటూ సోషల్ మీడియాలో వ్యక్తిగత, అసత్య ఆరోపణలతో పోస్టులు పెట్టడం హేయమైన చర్య అన్నారు.

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే హయాంలో ఏం జరిగిందో అందరికి తెలిసిందే అన్నారు. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఓర్వలేక రాజకీయం తెలియని వారితో ఇష్టం వచ్చినట్లు ఆరోపణలు చేయించడం నీచంగా ఉందన్నారు. అభివృద్ధి పనుల్లో తేడా ఉన్నా, ప్రజలు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నా స్వేచ్ఛగా ప్రశ్నించే అవకాశం అందరికీ ఉందన్నారు. గత బీఆర్ఎస్ ఎమ్మెల్యే హయాంలో మట్టి దందా, ఇసుక దందా, ఇలా ప్రతి పనిలో అవినీతి జరిగిందని, ప్రజలకు విసుగొచ్చి భారీ మెజార్టీతో ఓడించిన విషయం మర్చిపోతే ఎలా అని ప్రశ్నించారు.

ఇకముందు మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతిపై వ్యక్తిగత, అసత్య ఆరోపణలు చేస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. ఈ విలేకర్ల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షుడు ఇర్లా సీతారాంరెడ్డి, ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాషబోయిన భాస్కర్ రావు, కోదాడ మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కొత్తా గురవయ్య, పీఏసీఎస్ చైర్మన్లు నలజాల శ్రీనివాసరావు, నంబూరి సూర్యం, నాగిరెడ్డి, మహిళా సర్పంచ్ బల్గూరి స్నేహ, నాయకులు పాల్గొన్నారు.