సేవకులుగా పనిచేయండి
- ప్రతి పేద కుటుంబానికి సంక్షేమం చేరవేయాలి
త్వరలో హార్వర్డ్ యూనివర్సిటీతో ఎంసీహెచ్‌ఆర్డీ మధ్య ఒప్పందం
గరం, నరం, బేషరం అనే నానుడి తప్పని నిరూపించాలి
గ్రూప్ 1, గ్రూప్ 2 నూతన అధికారుల శిక్షణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాం తి) : రాష్ట్రంలో తాజాగా నియామకమైన గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థులు ప్రజల ఆశయా లను నెరవేర్చే బాధ్యతను గుర్తుంచుకోవా లని, అధికారులుగా కాకుండా సేవకులుగా పనిచేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచిం చారు. మీరు ప్రభుత్వానికి కళ్లు, చెవులుగా పనిచేస్తూ సంక్షేమ కార్యక్రమాలను ప్రతి పేద కుటుంబానికి చేరవేయాలని కోరారు.
గురువారం గ్రూప్-1, గ్రూప్-2 నూతన అధికా రుల శిక్షణ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ... శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులకు అభినందనలు తెలి పారు. మొన్నటివరకు విద్యార్థులు, నిన్న నిరుద్యోగులు అయిన మీరు ఈరోజు అధికా రులు అయ్యారని, ఇప్పుడు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు సేవలు అందించే బాధ్య త మీపై ఉందన్నారు.
తెలంగాణ ప్రజలు ఆకలినైనా సహిస్తారు కానీ ఆధిపత్యాన్ని మాత్రం ఒప్పుకోరని సీఎం అన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాడిన అమరవీరుల స్ఫూర్తిని అధికారులు ఎప్పటికీ గుర్తుంచుకో వాలని సూచించారు.ఆ పోరాటాల్లో రాంజీ గోండు, కొమరం భీం వంటి నాయకులు ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారని గుర్తు చేశారు.
అలాగే సమ్మక్క సారలమ్మ కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరే కంగా చేసిన పోరాటం వల్లే వారు వనదేవత లుగా గౌరవించబడుతున్నారని తెలిపారు. దేశంలోనే మొదటి ఎన్నికల్లో అత్యధిక మె జార్టీతో గెలిచిన నాయకుడు రావి నారాయ ణరెడ్డి కూడా తెలంగాణకు చెందిన వారేనని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో మూడు రకాల పరిస్థితులు ఎదురవుతా యని సీఎం అన్నారు.
1.గరం 2.నరం 3.బేష రం.. మీరంతా మొదటి పరిస్థితి దగ్గరే ఆగిపోతే బాగుంటుందని, గరం, నరం, బేష రం అనే నానుడి తప్పు అని మీరంతా నిరూ పించాలని ముఖ్యమంత్రి సూచించారు. సుమారు 6 లక్షల మంది పోటీ పడగా 582 మంది గ్రూప్-1, 775 మంది గ్రూప్-2 ఉద్యో గాలు సాధించారని తెలిపారు.
మనిషిగా పతనం కావొద్దు
అధికారులుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మనిషిగా పతనం కాకుండా సేవాభావంతో పనిచేయాలని సీఎం సూచించారు. ఆఫీస్‌కు వెళ్లే ముందు ప్రజాసేవకు అంకితమైన అధికారి ఎస్.ఆర్.శంకరన్‌ను తలచుకోవాలని చెప్పారు. పేదవారికి సహాయం చేసే ముందు తల్లి దండ్రులను గుర్తు పెట్టుకోవాలని, వారిని గౌరవించాలని అన్నారు. తల్లిదండ్రులను పట్టించు కోని ఉద్యోగుల జీతంలో 10 నుంచి 15 శాతం కోత విధించేలా అసెంబ్లీలో చట్టం తీసుకురా వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.
అధికారుల శిక్షణను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే దిశగా త్వరలో హార్వర్డ్ యూనివర్సిటీ, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ మధ్య ఒప్పందం కుదరనుందని సీఎం తెలిపారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి నిపుణులు వచ్చి ఎంసీహెచ్‌ఆర్డీలో అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారని చెప్పారు. ప్రజా పాలనలో నిజాయితీ, సేవాభావం, సామాజిక న్యాయం అనే విలువలను పాటిస్తూ పనిచేయాలని సీఎం నూతన అధికారులకు సూచించారు.




