24 May, 2026 | 12:01 PM

రాజకీయాలకు అతీతంగా సేవచేస్తా

11-11-2024 12:42 AM

ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

భైంసా, నవంబర్ 10 (విజయక్రాంతి): ముథోల్ నియోజకవర్గంలో ప్రజలకు రాజకీయలకు అతీతంగా సేవలు అందిస్తానని ఎమ్మెల్యే పవార్ రామారావుపటేల్ అన్నారు. భైంసా ఎస్‌ఎస్ జిన్నింగ్ మిల్లులో ఆదివారం పలువురు బాధిత కుటుంబాలకు రూ.55 లక్షల విలువైన సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను ఎల్లవేళలా ప్రజల సమస్యలు తీర్చేందుకు అందుబాటులో ఉంటాన్నారు. అందుకోసం తన నివాసం వద్ద ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. సీఎం సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకునే ఆనారోగ్య, ప్రమా ద బాధిత కుటుంబాల సభ్యులు కార్యాలయంలో సేవలు ఉపయోగించుకోవాలని కోరారు. 

ప్రజలు తనను నేరుగా వచ్చి కలిసి సమస్యలు విన్నవించినా వాటిని ప్రభుత్వ, ఉన్నతా ధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. భాజపా నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.