calender_icon.png 30 August, 2025 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

ఆలయాలపై దాడి చేసిన వ్యక్తి అరెస్టు

11-11-2024 12:40:38 AM

రాజేంద్రనగర్, నవంబర్10: శంషాబాద్ మండల పరిధిలో ఆలయాలపై దాడిచేసిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. శంషాబాద్ డీసీపీ రాజేశ్ ఆదివారం కేసు వివరాలు వెల్లడించారు.మహారాష్ట్ర జల్‌గావ్ జిల్లాకు చెందిన సలీం ఆర్మన్ తాడ్వి కొంతకాలం క్రితం నగరానికి వలస వచ్చాడు. శనివారం సాయం త్రం జూకల్‌లోని చౌడమ్మ, సోమన్న ఆలయాల్లో చోరీకి యత్నించాడు. అక్కడ చౌడమ్మ దేవత కుడికన్నును ధ్వంసం చేశాడు. అనంతరం అమ్మవారికి అలంకరించిన చీర, సోమన్న ఆలయంలో ధోతి ధ్వంసం చేశాడు. అతడిని గమనించి స్థానికులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. నిందితుడిపై గతంలో చోరీ, ఇతర కేసులు కూడా నమోదయ్యాయి.