calender_icon.png 6 December, 2025 | 9:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానవసేవే మాధవసేవ..

06-12-2025 07:50:43 PM

ఉప్పల్ (విజయక్రాంతి): మానవసేవనే మాధవసేవా అని స్మైల్ విత్ షైన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు గ్రేసీ అన్నారు. స్మైల్ విత్ షైన్ ఆధ్వర్యంలో నాచారం దుర్గానగర్ లో శనివారం రోజున హెచ్ఐవి వ్యాధిగ్రస్తులకు దుప్పట్లు కిరాణ సామాన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హెచ్ఐవి పట్ల అపోహలు మాని అవగాహన పెంచుకోవాలన్నారు. మానవసేవే మాధవసేవ అని వ్యాధి వచ్చింది అని భయపడకుండా మనోధైర్యంతో ఉండాలని ఆమె సూచించారు. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్యుని సూచనలు మేరకు మందులు వాడాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో లాజర్ పాస్టర్ శాంసన్ రోజా నంద రెడ్డి పాల్గొన్నారు.