calender_icon.png 6 December, 2025 | 8:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఈశ్వరీభాయి 107వ జయంతి వేడుకల్లో పాల్గొన్న టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి

06-12-2025 07:48:39 PM

సంగారెడ్డి,(విజ‌య‌క్రాంతి): ప్రముఖ సామాజిక సేవకురాలు, రాజకీయ వేత్త స్వర్గీయ ఈశ్వరిభాయి 107వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈశ్వరిభాయి కుమార్తె  మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ లీడర్ గీతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు.  మాజీ మంత్రి గీతారెడ్డి,  శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు సీతక్క, వివేక్ లు  ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి ని సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ  ఈశ్వరిభాయి ఒక రాజకీయ నేతగా ఎంతో మంది మహిళల్లో స్ఫూర్తి నింపారన్నారు.  తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈశ్వరిభాయి కీలక పాత్ర పోషించారన్నారు. ప్రత్యేకించి దళితులు, మహిళల అభ్యున్నతి కోసం ఆమె చేసిన కృషిని ఈ సమాజం మరిచిపోదన్నారు.