14 July, 2026 | 1:03 PM

తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి

08-07-2026 07:41 PM

ఐ క్యాంప్, జనరల్ మెడికల్ క్యాంపులతో పేదలకు పరీక్షలు

లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్, చీఫ్ గెస్ట్, తీగల మోహన్ రావు

తుంగతుర్తి( విజయ క్రాంతి): తుంగతుర్తి లైన్స్ క్లబ్ సభ్యుల ద్వారా పేద ప్రజలకు అందిస్తున్న సేవలు మరువలేని, ప్రతి ఒక్కరు సేవా భావాన్ని అలపర్చుకోవాలని లైన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ చీఫ్ గెస్ట్ మోహన్ రావు అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని డిఆర్ ఫంక్షన్ హాల్ లో లైన్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవంలో భాగంగా అధ్యక్షులు తల్లాడ పద్మ కేదారి, సెక్రటరీ గుండ గాని రాము గౌడ్, ట్రెజరర్ ఓరుగంటి శ్రీనివాస్, లైన్స్ సభ్యులను శాలువా మెమెంటోళ్ళతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడిచిన సంవత్సరం లైన్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు పోలవరపు సంతోష్ ఆధ్వర్యంలో ఎన్నో బృహత్కర సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని కొనియాడారు.

అదే రీతిలో ప్రస్తుతం సుమారు 30 మందికి పైగా క్లబ్ సభ్యులను ఏర్పాటు చేసుకొని, ఐకమత్యంతో సమావేశాలు ఏర్పాటు చేసుకొని, రానున్న రోజుల్లో జిల్లాలోనే పేదవారికి అత్యధిక సేవలు ఏర్పాటు చేయాలని కోరారు. తుంగతుర్తి నూతన కమిటీ క్లబ్ ఇన్స్టాలేషన్ పీఎంజేఎఫ్ లైన్ మదన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో లైన్స్ సభ్యులను, ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం తుంగతుర్తి మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలలో అత్యధిక మార్కులు సాధించిన కటకం కావ్య శ్రీ, సమాజ సేవలో కరాట మాస్టర్గా రాణిస్తున్న బొంకూరి అరుణలను గౌరవంగా శాలువాతో సన్మానించారు.