8 July, 2026 | 8:14 PM

Breaking News

కామారెడ్డి మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిగా కుమారి ప్రసన్న   •   గ్రాన్యూల్స్ ఇండియాలో 27 మంది ప్రభుత్వ విద్యార్థులకు ఉద్యోగాలు   •   వదలపర్తి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు మార్కింగ్   •   మీసేవ కేంద్రాల్లో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి   •   ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు   •   నగరంలోని పలు డివిజన్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •  

కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు

08-07-2026 07:39 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): మాజీ ముఖ్యమంత్రి దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి  జయంతి సందర్భంగా బుధవారము రోజున కరీంనగర్ డిసిసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ మేడిపల్లి సత్యం  హాజరై , కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసయ్య తదితరులతో కలిసి వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల సమర్పించి ఘనంగా నివాళులు అర్పించినారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం  మాట్లాడుతూ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి  అతి చిన్న వయసులో శాసనసభకు ఎన్నికై మంత్రిగా, ప్రదేశ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎన్నో సేవలు చేసినారు, 2003లో రాష్ట్రవ్యాప్తంగా సుదీర్ఘమైన పాదయాత్ర చేపట్టి 2004లో ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి దోహద పడిన వ్యక్తి అని ,రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ దేశంలోనే సంక్షేమం అనే పదానికి పూర్తి చిరునామాగా నిలిచారు, వారి హయాంలో పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ సేవలు, ఫీజు రియంబర్స్మెంట్, మరి ముఖ్యంగా రైతాంగానికి ఉపయోగపడే విధంగా జలయజ్ఞం ద్వారా అనేక సాగునీటి ప్రాజెక్టులు నిర్మించడం జరిగింది.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద కాలువల నిర్మాణం చేపట్టి రాష్ట్ర రైతాంగానికి అండగా నిలిచిన గొప్ప నాయకుడని కొనియాడారు. రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ, చొప్పదండి నియోజకవర్గం లో జేఎన్టీయూ లాంటి ఎన్నో విద్యాసంస్థలు నెలకొల్పడం ద్వారా ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్న నాయకుడిగా నేటికీ కీర్తించబడుతున్నారు, దురదృష్టవశాత్తు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించి రాష్ట్ర ప్రజలను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులను శోకసముద్రంలో ముంచినారు, తెలంగాణ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు.