10 June, 2026 | 4:11 PM

Breaking News

నల్గొండ జిల్లా అభివృద్ధిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీక్ష   •   ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనపై పుస్తకావిష్కరణ   •   సిద్దాపూర్ రిజర్వాయర్ సందర్శించిన మంత్రి ఉత్తమ్   •   సుల్తానాబాద్ సీఐ రంజిత్ రావును మర్యాదపూర్వకంగా కలిసిన నేతలు   •   గాయపడిన గీత కార్మికుడికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియ ఇవ్వాలి   •   తెలంగాణ అభివృద్ధిలో 'భారత్ ఫ్యూచర్ సిటీ' నూతన అధ్యాయం: రేవంత్ రెడ్డి   •   భారతీరాజా మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం   •   నిరుపేదలకు వరంగా సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ   •   రాత్రిపూట కరిగిపోతున్న ఎర్ర మొరం గుట్టలు   •   అడ్వాన్స్ టెక్నాలజీ (ఏటిసి) లో అడ్మిషన్ల ను ఈనెల 30 వరకు గడువు పొడిగింపు   •  

ఏడు రోజులు.. ఐదేళ్ల భవితవ్యం!

04-02-2026 12:08 AM
  1. రాజకీయ భవిష్యత్తుపై అభ్యర్థుల ఆత్రుత

పాలమూర్ తొలి మేయర్ ఎవరో?

నేటి నుంచి ఉత్కంఠగా ప్రచార హోరు 

ముగిసిన విత్ డ్రాల మంతనాలు 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 3(విజయ క్రాంతి): రాజకీయ రంగంలో తమదైన ముద్ర వేసుకునేందుకు అభ్యర్థులు తెగ ఆరటపడుతుండ్రు. సరిగ్గా నేటి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు ప్రచారం ముగించుకుని 11న జరిగే కార్పొరేటర్ల, కౌన్సిలర్ల ఎన్నిక ల తో పాటు మేయర్ చైర్మన్ ల ఎన్నిక కూడా ఈ తేదీ ఎంతో ప్రత్యేకమైనది. ఏడు రోజుల్లో శ్రమించి పనిచేస్తే.. ప్రజలు ఆశీర్వదిస్తే ఐదేళ్లపాటు తమ రాజకీయ భవిష్యత్తుపై ఎంతో ఆశలు పెట్టుకున్న నేతలు ఎవరికి వారు ప్రత్యేక చర్యలు తీసుకుంటూ రాజకీయ రంగంలో తమదైన ముద్ర వేసుకునేందుకు ఆత్రుత కనబరుచుతుండ్రు.

పాలమూరు తొలి మేయర్ బిసి మహిళల అధికార కాం గ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలు సైతం మా మేర అభ్యర్థి వీరే అని మాత్రం ఎక్కడ ప్రకటించడం లేదు. ఎవరికి వారు తామే గెలుస్తాం.. తమ వారి మేయర్ అవుతారు అనుకుంటున్నాప్పటికీ ఆయా పార్టీల అధిష్టానాలు కూడా ఎవరికి మేయర్, చైర్మన్ల బాధ్యతలను అప్పగిస్తుందో? సమాధానం తెలియని ప్రశ్న ప్రజల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుంది.

- విత్ డ్రాల కాకపోయిన.. బరిలో ఉన్న అడుగుదాం..

ఆయా పార్టీలలో టికెట్లు ఆశించిన అభ్యర్థులకు టికెట్లు దక్కకపోవడంతో పాటు విత్ డ్రా చేసుకోవడంలో కూడా వెనుకంజువేసిం డ్రు. ప్రతిపక్ష అధికారం పార్టీల నేతలతో పా టు సంప్రదింపులు జరుగుతున్నప్పటికీ విత్ డ్రా చేసుకోవడంలో ఏ నేతలకు అందనంత దూరంగా కొందరు అభ్యర్థులు ఉన్నారు.

దీంతో విత్ డ్రా చేసుకోకపోయినప్పటికీ బరి లో ఉన్న అభ్యర్థులను సంప్రదింపులు చేసి ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా గెలుపే లక్ష్యంగా అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని తెలుస్తుంది. విత్ డ్రా చేసుకుంటారేమో అనే భయంతో కూడా కొందరు నేతలు తమ ఫోన్లను స్విచ్ ఆఫ్ చేసుకున్నారని పలువురు చర్చించుకుంటుండ్రు. 

- మేయర్ అభ్యర్థులు జాగ్రత్త ఉండాల్సిందే...

చిత్ర విచిత్రంగా కొంతమంది అభ్యర్థుల తీరు దర్శనమిస్తుంది. ఇప్పటికే తామే మేయ ర్ అనుకుంటున్నా అభ్యర్థులు గెలుపుకు దూరంగా ఉంటే మేమే మేయర్ అవుతాం అనుకున్న మరికొందరు నేతలు కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా మేయర్ అభ్యర్థులు ఎంతో జాగ్రత్తగా ముందు తమ గెలుపు దిశగా ఎక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా అడుగులు వేయవలసిన అవసరం ఎంతైనా ఉందని పట్టణ ప్రముఖులు చెబుతున్న మాట.

అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ లు అయిన తమ అభ్యర్థుల గెలుపు కోసం ఐక్యంగా ముందుకు సాగితేనే వారు ఆశించిన మేరకు సీట్లు అత్యధికంగా గెలిపించు కునే అవకాశాలు మెండుగా ఉన్నాయని పుర ప్రజలు చెబుతున్న మాట. కాగా గెలుపు ఎటువైపు ఎవరిని తీసుకుపోతుందో మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.