calender_icon.png 9 November, 2025 | 2:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏడుగురు మావోయిస్టుల లొంగుబాటు

09-11-2025 12:22:21 AM

పోలీసులకు ఆయుధాల అప్పగింత

చర్ల, నవంబర్ 8 (విజయక్రాంతి): చత్తీస్‌గఢ్ రాష్ట్రం గరియాబం ఉదాంటి ఏరియా కమిటీలో చురుకుగా ఉన్న ఏడుగురు మావోయిస్టులు శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో ఉదంటి ఏరియా కమాండర్ సునీల్, సెక్రటరీ అరీనా ఉన్నారు. వీరిపై ఒక్కొక్కరికి రూ.8 లక్షల రివార్డు ప్రకటించారు. వీరితో పాటు, కమిటీ సభ్యులు లుడ్రాన్, విద్య, నందిని, మలేష్ లకు ఒక్కొక్కరికి రూ.5 లక్షల రివార్డు ఉంది. కాంతిపై లక్ష రూపాయల రివార్డు ఉంది. మావోయిస్టుల వద్ద ఉన్న ఒక ఎస్‌ఎల్‌ఆర్, మూడు ఇన్సాస్ రైఫిల్స్, ఒక సింగిల్ షాట్ ఆయుధాలను పోలీసులకు అందజేశారు. 

ఇద్దరు మావోయిస్టులు అరెస్ట్ 

చత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో చింతల్నార్ పోలీస్ స్టేషన్ పరిధిలో భీమపురం గ్రామ అడవి సమీపంలో పోలీసులకు పేలుడు పదార్థాలతో ఇద్దరు మావోయిస్టులు పట్టుబడ్డారు. వారిని పోలీసులు అరెస్టు చేసి, స్టేషన్‌కు తరలించారు. తమ పేర్లను పాదం హండా, తాటి హద్మా (మిలిషియా కమాండర్) అని మావోయిస్టులు చెప్పారు. వారి నుంచి 9నాన్-ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, 5 నంబర్ జెలటిన్ రాడ్లు, 45 అడుగుల కార్డెక్స్ వైర్, 55 మీటర్ల ఎలక్ట్రిక్‌వైర్, 14 అడుగుల ఫ్యూజ్‌వైర్ స్వాధీనం చేసుకున్నారు. 

హిడ్మా కోసం కర్రెగుట్టల్లో వేట!

మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మా ఆచూకీ కోసం కర్రెగుట్ట అటవీ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడు పడుతున్నట్టు తెలుస్తున్నది. కర్రెగుట్టల చుట్టూ మోహరించి మావోయిస్టులకు గురి పెట్టేందుకు గన్ లోడ్ చేసి సిద్ధంగా ఉన్నారు. ఏ క్షణాన ఏం జరుగుతుందో అంటూ ఉత్కంఠతర రేకెత్తిస్తుంది.