ఉపాధి హామీ కూలీల ఆందోళన
కూలీ డబ్బులను వెంటనే చెల్లించాలి
పనిభారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలి
జహీరాబాద్, మే 14 : జహీరాబాద్ ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఉపాధి హా మీ కూలీలు ఆందోళన చేశారు. మంగళవా రం జహీరాబాద్ మండలంలోని అల్గోల్ గ్రా మానికి చెందిన ఉపాధి హామీ కూలీలు స్థాని క ఎంపీడీవో కార్యాలయానికి డీసీఎంలో తరలివచ్చి బైఠాయించి, ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి రోజు పనులు చేస్తున్న సకాలంలో కూలీ డబ్బులు చెల్లించకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదన్నారు. ఈ విషమై పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికీ తీసుకెళ్లిన ఫలితం లేదని వాపోయారు. ఉపాధి హామీ అధికారులు చేసిన పనులకు సరైన కొలతలు తీయకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వారికి ఇష్టమొచ్చిన చోట తమతో పనులు చేయిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. సంబంధిత అధికారులు అందుబాటులో లేకపోవడంతో కూలీ లు వెనుదిరిగి వెళ్లిపోయారు. తమ సమస్యలను పరిష్కరించకుంటే మరోసారి వచ్చి ఆం దోళన చేపడుతామని హెచ్చరించారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కూలీలు కోరారు.




