9 April, 2026 | 1:59 AM

టీఆర్పీలో పలువురి చేరిక

09-04-2026 12:08 AM

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, ఏప్రిల్ 8(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు గంగిపల్లి అరుణ ఆధ్వర్యంలో, తెలంగాణ రాజ్యాధికార పార్టీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బందారపు నరసయ్య గౌడ్ సమక్షంలో బుధవారం జిల్లాకు చెందిన పలువురు తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి టీఆర్పీ అధినేత మల్లన్న కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీ వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడుతున్న ఏకైక పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీనే అని స్పష్టం చేశారు.బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై పార్టీ ఎప్పటికప్పుడు పోరాటం కొనసా గిస్తుందని తెలిపారు.ప్రతి ఒక్క కార్యకర్త పార్టీకి ఇంధనంలా పని చేసి గ్రామ స్థాయి వరకు పార్టీని విస్తరించి బలోపేతం చేయాలని నూతనంగా చేరిన కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

కొత్తగా పార్టీ లో చేరిన నాయకులు మాట్లాడుతూ బీసీలకు నిజమైన రాజకీయ అధికారాన్ని అం దించే శక్తి తెలంగాణ రాజ్యాధికార పార్టీకే ఉందని, బీసీల రాజ్యం ఈ పార్టీ ద్వారానే సాధ్యమవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

అగ్రవర్ణాల ఆధిపత్యంలో ఉన్న బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను విడిచి, బీసీలంతా తమ ఇంటి పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరాలని పిలుపునిచ్చా రు. పార్టీలో చేరిన వారు కొత్తకొండ వేణు, ఒర్సు ల విమల, గంగిపల్లి రమేష్, వీర్ల నాగసంతోష్, తరాళ్ల కిరణ్, జగిరి శ్రవణ్, గాడే శ్రీకాంత్, హరి, మద్దెల రవిరాజ్, గాజుల మధు ఉన్నారు.