23 May, 2026 | 10:52 AM

బావ గొంతు కోసిన బావమరుదులు

19-06-2024 12:05 AM

కామారెడ్డి, జూన్ 18 (విజయక్రాంతి): చెల్లెలి కాపురం చక్కదిద్దే క్రమంలో ఘర్షణ జరిగి బావమరుదులు బావ గొంతు కోసిన ఘటన మంగళవారం లింగంపేట మండలం మెంగారంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన స్వామికి సునీతతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరు కామారెడ్డిలో అద్దె ఇంట్లో ఉంటున్నారు. కొద్దిరోజు లుగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకుంటున్నాయి. సునీత పిల్లలను తీసుకు ని పుట్టింటికి వెళ్లింది. సునీత కాపురాన్ని సరిదిద్దేందుకు ఆమె సోదరులు నవీన్, సుధాకర్ సోమవారం మెంగారం వెళ్లారు. బావకి నచ్చజెప్పే క్రమంలో పరిస్థితులు ఘర్షణకు దారి తీశాయి. ఈక్రమంలో నవీన్, సుధాకర్.. స్వామి గొంతుకోశారు. క్షతగాత్రుని కుటుంబ సభ్యులు ఎల్లారెడ్డి ప్రభు త్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.