calender_icon.png 22 January, 2026 | 10:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వృద్ధురాలిపై లైంగిక దాడి

19-09-2024 01:18:45 AM

నల్లగొండ, సెప్టెంబర్ 18 (విజయక్రాంతి): వృద్ధురాలిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన నల్లగొండ పట్టణంలోని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బు ధవారం తెల్లవారుజామున జరిగింది. 60 ఏండ్ల వృద్ధురాలు బుధవారం తెల్లవారుజామున నల్లగొండ పట్టణంలోని రామగిరి ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్తున్నది. హిందూశ్మశాన వాటిక వద్దకు రాగానే కందుల కృష్ణ అనే యువకుడు  ఆమెను అటకాయించాడు. సమీపంలోని సమాధుల మధ్యలోకి లా క్కెళ్లి అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తాని బెదించి వెళ్లిపోయాడు. వృద్ధురాలు ఇంటికి వెళ్లి కూతురు సాయంతో వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాజశేఖర్‌రెడ్డి తెలిపారు.