14 August, 2026 | 2:32 AM

మైనారిటీ రెసిడెన్షియల్‌లో లైంగిక వేధింపులు!

14-08-2026 12:00 AM

నాగర్‌కర్నూల్‌లో విద్యార్థులపై ఉపాధ్యాయుడి స్వలింగ లైంగిక వేధింపులు

నాగర్‌కర్నూల్, ఆగస్టు 13 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్‌లోని మైనారిటీ బా లుర రెసిడెన్షియల్ పాఠశాలలోని విద్యార్థులపై ఉపాద్యాయుడు స్వలింగ లైంగిక వేధిం పుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఉర్దూ బోధించే ఒప్పంద ఉపాధ్యా యుడు సయ్యద్ ఇమ్రాన్ పలువురు విద్యార్థులను లైంగికంగా వేధించినట్టు తల్లిదండ్రు లకు తెలపడంతో పాఠశాల ప్రిన్సిపాల్‌ను నిలదీశారు. విద్యార్థులతో మాట్లాడి ప్రాథమిక విచారణ అనంతరం ఉన్నతాధికారుల కు తెలియకుండా గొప్యత పాటిస్తూనే ఉపాద్యాయుడు ఇమ్రాన్‌ను విధుల నుంచి తొల గించారు.

ఈ ఘటన ఆలస్యంగా వెలుగులో కి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆం దోళన వ్యక్తమవుతున్నది. కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్న సదరు ఉపాధ్యాయుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే కేవలం వి ధుల నుంచి తప్పించడం, ఉన్నతాధికారుల కు విషయం తెలపకుండా గోప్యత పాటించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై మైనార్టీ వెల్ఫేర్ ఇన్‌చార్జ్ అధికారి రాజేశ్వరి  నివేదిక పంపామన్నారు.