16 April, 2026 | 3:10 AM

180 మంది బాలికలకు లైంగిక వేధింపులు

16-04-2026 01:34 AM

350కి పైగా అశ్లీల వీడియోలను చిత్రీకరించిన యుటూబర్ తన్వీర్

నాసిక్‌లోని ఇంటిపై బుల్డోజర్ ఆపరేషన్

ముంబై, ఏప్రిల్ 15: ప్రేమపేరుతో మభ్యపెట్టి, 180 మంది బాలికలను లైంగికంగా వేధి స్తూ.. 350కిపైగా అశ్లీల వీడియోలను చిత్రీకరించిన యుటూబర్ మహ్మద్ అయాజ్ అలి యాజ్ తన్వీర్ ఇంటిపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ నిర్వహించింది. అతని ఇంటితోపాటు, సమీపంలోని అక్రమ నిర్మాణాలను సైతం కూల్చివేసింది.

మహారాష్ట్రలోని పరాత్వడ నగరానికి చెందిన యుటూబర్ మహ్మద్ అయాజ్ అలియాజ్ తన్వీర్ అనే యువకుడు బాలికలను ప్రేమ పేరుతో ట్రాప్ చేసి, నమ్మించేవాడు. వారికి మాయమాటలు చెప్పి వారిని ముంబై, పూణెకు తీసుకెళ్లేవాడు. అక్కడ వారిని లైంగికంగా వేధించి, రహస్యం గా వారి అశ్లీల వీడియోలను చిత్రీకరించేవాడని ఆరోపణలు ఉన్నాయి.

వీడియోల ద్వారా వారిని బెదిరిస్తూ.. బాక్‌మెయిల్ చేస్తూ.. కొందరి వీడియోలను అన్‌లైన్‌లో పెట్టినట్లు సమాచారం. ఓ వినతి పత్రం ద్వారా ఎంపీ బోండేకు ఈ విషయం తెలియడంతో నిందితుడి అకృత్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వ్యవహారంపై ఎంపీ తీవ్రంగా స్పందించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా ప్రతేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ఆపరేషన్ నిర్వహించింది.

అతడి నివాసానికి సమీపంలోని అక్రమ కట్టడాలను సైతం మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. బీజేపీ ఎమ్మెల్యే ప్రవీణ్ పర్యవేక్షణలో ఈ కూల్చివేతలు జరిగినట్లు తెలిపారు. అక్రమ కట్టడానికి సంబంధిం చి నిందితుడి కుటుంబానికి గతంలోనే మున్పిసల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేశారు. వాటిపై ఎలాంటి స్పందన రాకపోవడంతో ఆ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. మరోపక్క సైబర్ సెల్ సాయంతో ఆన్‌లైన్‌లో షేర్ చేసిన అశ్లీల వీడియోలను తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.