సేవాలాల్ ఆలయంలో ప్రత్యేక పూజలు
10-08-2026 12:28 AM
పకీర్ టేక్య తండాలో బంజారాల జెండా పండుగ
ఘట్‌కేసర్, ఆగస్టు 9 (విజయక్రాంతి): ఘట్కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధి, ఘనపురంలోని పకీర్ టేక్య తండా లో బంజారాల సంప్రదాయ జెండా పండు గను శ్రీజగదాంబదేవి సహిత శ్రీసేవాలాల్ మహారాజ్ ఆలయంలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్ ముఖ్య అతిధిగా హాజరై జగదాంబ, సేవాలాల్‌కు పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు రూప్‌సింగ్ నాయక్, గోపాల్ రెడ్డి, కొమురవెల్లి దేవస్థానం ధర్మకర్త నరేష్ గౌడ్, తండావాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.






