calender_icon.png 5 February, 2026 | 7:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేట జిల్లాలో షాడో ఎమ్మెల్యే

05-02-2026 12:08:26 AM

  1. ఆస్పత్రి డెవలప్మెంట్ సభ్యుడి హోదాలో ఎమ్మెల్యే తరుపున హామీలు ఇస్తున్న వైనం

శంకుస్థాపనలో పాల్గొంటున్నవైనం

తనదైన శైలిలో నిర్ణయాలు తీసుకొంటూ పాలన 

సమీక్షలో పాల్గొంటున్నవైనం

ఆయనకు ఎలాంటి పదవీ లేదు గతంలో ఆయనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీటు కేటాయించక పోవటంతో ఆయన మేన కోడలుకు ఎమ్మెల్యే సీటు కేటాయించింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవటంతో ప్రభుత్వం తరుపున హామీలు ఇవ్వడం అధికారులకు ఆదేశాలు జారీ చేయటం, తనకు ఎన్నికల్లో ఆర్థికంగా సహకరించిన నాయకులకు, మరికల్ మండల కేంద్రానికి చెందిన నాయకుడికి ప్రభుత్వ భూములు కబ్జా చేయటంలో సహకరించటం, పేట జిల్లా కేంద్రానికి చెందిన వ్యాపారవేత్తకు మున్సిపా లిటీలో అత్యున్నత పదవి కట్టబెట్టడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శలు ఉన్నాయి.

నారాయణపేట. ఫిబ్రవరి, 4(విజయక్రాంతి) : నారాయణపేట జిల్లాలో స్థానికంగా ఎమ్మెల్యే లేకపోవటంతో అన్ని తానై వటుడింత అయినట్లు, అంతా పాలన ఆయనతోపాటు బంధువుల,కనుసన్నల్లో జ రుగుతున్నట్లు ప్రతిపక్షాలు విమర్శలు సైతం చేస్తున్నారు . జిల్లాలో ఒకానొక సందర్భంలో షాడో ఎమ్మెల్యే గా పని చేస్తున్నారు అని విమర్శలు సైతం ఉన్నాయి. అధికారులకు ఆ దేశాలు సైతం ఇస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శలు సైతం చేస్తున్నారు దీంట్లో భాగంగానే ఇసుక అక్రమ రవాణా వ్యాపారం చేయటానికి గాను కొంతమందికి అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో వార్డుల్లో ఎమ్మెల్యే లేకపోవటంతో అంతా తానై వటుడింత అయినట్లు ఆయా వార్డుల్లో కౌన్సిలర్ అభ్యర్థుల తరుపున హామీలు ఇస్తూ ప్రచారం6చేస్తున్నారు. దీంట్లో భాగంగానే ప్రచారంలో గతతాజా మాజీ ము న్సిపల్ ఛైర్పర్సన్ ఉద్దేశించి ఇంతవరకు పనిచేసిన వారు చందాలు దందాలు బంద్ అని షాడో ఎమ్మెల్యే విమర్శలు సైతం చేస్తుంటే ప్రతి పక్షాలు మాత్రం చందాలు దందాలు బంద్ అని మీరే అంటున్నారని మరి అలాంటప్పుడు చందాలు దందాలు చేసే వాళ్ళని మీరు రెండేండ్లుగా మీ పార్టీలో తీసుకోవ టం లో అంతర్యం ఏమిటని చందాలు దం దాలు లో మీరు కూడా భాగస్వామి కాదా అని ప్రతిపక్షాలు విమర్శలు సైతం చేస్తున్నా రు.

ఏది ఏమైనా ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో వ్యాపారవేత్త సతీమణి నీ చైర్ పర్సన్ గా పోటీచేయించి మీచందాలు దందాలు కోసం కాదా అని పలువురు విమర్శిస్తున్నారు.