13 April, 2026 | 7:39 PM

12 సీట్లు ఇస్తే మళ్లీ కేసీఆరే

09-05-2024 01:44 AM

పరిపాలన చేయడమంటే పాన్ డబ్బా నడిపుడు కాదు

తెలంగాణను పరిపాలించడం కేసీఆర్‌కే సాధ్యం

నమో అంటేనే నమ్మించి మోసగించడం

ఈటల, సునీతా మహేందర్ రెడ్డి నాన్‌లోకల్

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

నాగర్‌కర్నూల్/వనపర్తి/ హైదరాబాద్/ హైదరాబాద్ సిటీబ్యూరో, మే 8(విజయక్రాంతి): గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి ఓట్లు వేయించుకొని పరిపాలన చేతకాక చతికల పడిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎద్దేవాచేశారు. ప్రజలు బాధప డొద్దని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు 12 సీట్లు గెలిపించి, పార్లమెంటుకు పంపితే ఆరు నెలలు తిరగక ముందే మళ్లీ కేసీఆర్ రాష్ట్రాన్ని శాసించే స్థితి వస్తుందని స్పష్టంచేశారు. బుధవారం నాగర్‌కర్నూల్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని ఆమన్‌గల్, కల్వకుర్తి, అచ్చంపేట, గద్వాలలో ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్‌ను గెలిపించాలని కోరుతూ కేటీఆర్ రోడ్‌షో నిర్వహించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం లంకెబిందలు దొరుకుతాయని అధికారంలోకి వచ్చామని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. లంకెబిందెల కోసం రాత్రిళ్లు తిరిగేవాళ్లను ఏమంటారు? అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని నడపడం అంటే పాన్‌డబ్బా నడిపినట్టు కాదని, గుంపుమేస్త్రీకి తెలంగాణను పరిపాలించే సత్తా లేదని విమర్శించారు. జేబులో కత్తెర్లు పెట్టుకొని తిరుగుతా అంటూ జేబుగొంగల మా దిరి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పేగులు మెడలో వేసుకుంటా అని చేస్తున్న వ్యాఖ్యలను తప్పుపట్టారు. అసలు నువ్వు ముఖ్యమంత్రివా? బోటీ కొట్టెవాడివా అంటూ ఎద్దేవాచేశారు. ఇలాంటి వారిని ముఖ్యమంత్రిని చేయడం మన తప్పని అన్నారు. ఒకసారి మోసపోతే మోసగించినోడిది తప్పు.. కానీ, రెండోసారీ మోసపోతే మనదే తప్పు అవుతుందని హితవుపలికారు.

ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఎమ్మెల్సీ, టీఎస్పీఎస్సీ చైర్మన్ లాంటి బంపర్ ఆఫర్లు ఎన్నో ఇచ్చినా.. బీఆర్‌ఎస్ పార్టీలోకే వచ్చారని, పార్టీ అంటే అంత నమ్మకమని పేర్కొన్నారు. నమో అంటే నమ్మించి మోసగించడమని చెప్పారు. గత పదేళ్లుగా దేశంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఆరోపించారు. ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అంబే డ్కర్, పూలే ఆశయాలకు అనుగుణంగా పని చేసే వ్యక్తి అని కేటీఆర్ పేర్కొన్నారు. అలాంటి మంచి వ్యక్తిని ఎంపీ ఎన్నికల్లో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నడిగడ్డలో ఇద్దరు గట్టి నాయకులు ఉంటే గంజాయి మొక్కల్లాంటి బీజేపీ, కాంగ్రెస్ నాయకులను ఏరిపారివేయవచ్చని చెప్పారు. 

ఆలోచించి ఓటు వెయ్యాలి..

ఓటు వేసే ముందు ఆలోచించాలని, అబద్ధపు హామీలిచ్చేవారిని దూరం పెట్టాలని ప్రజలకు కేటీఆర్ పిలుపునిచ్చారు. మల్కాజిగిరి పరిధిలోని కుషాయి గూడలో బుధవా రం మైనార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ... పదేళ్ల  క్రితం బడేభాయ్ మెదీ ఎన్నో హామిలిచ్చారన్నారు. బుల్లెట్ ట్రైన్, ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు, నల్లధనం వంటి ఎన్నో హామీలు ఇచ్చినా ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. మనుషుల మనసుల్లో విషం నింపి రాజకీయాలు చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు నమ్మటంతో ప్రజలు మనల్ని ఓడించారన్నా రు. హైదరాబాదులో కాంగ్రెస్‌ను నమ్మలేదన్నారు. ఒక్కసీటును కూడా కాంగ్రెస్‌కు ఇవ్వలేదన్నారు.

కాంగ్రెస్ వచ్చిన నాలుగున్నర నెలల్లోనే విద్యుత్, నీళ్ల కష్టాలు మొదలయ్యాయన్నారు. హిందు, ముస్లిం అని ఎప్పుడు కేసీఆర్ చూడలేదన్నారు. కేసీఆర్ పాలనలో తమ సామరస్యాన్ని కాపాడారని గుర్తు చేశారు. ఒక్కసారి కర్ఫ్యూ పెట్టాల్సిన అవసరం కూడా రాలేదన్నారు. 204 మైనార్టీ స్కూల్స్ పెట్టారన్నారు. ఇందులో వందకు పైగా మైనార్టీ బాలికల కోసం స్కూళ్లు పెట్టారని గుర్తు చేశారు. ఒక్కో విద్యార్థిపై ఏటా లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేశారన్నారు. దేశంలో ఎన్నో రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ముస్లింలు ఇంకా ఎందుకు పేదరికంలో ఉన్నారని అన్నారు. కాంగ్రెస్‌ను నమ్మి ఓటు వేసినప్పుడ్లా ఆ పార్టీ మోసం చేసిందన్నారు.

కాంగ్రెస్‌కు ఓటువేస్తే అది ఖచ్చితంగా బీజేపీకే మేలు జరుగుతుందన్నారు. అమేథీలో బీజేపీతో పోటీ పడేందుకు రాహూల్‌గాంధీ భయపడుతున్నారన్నారు. అలాంటి వ్యక్తి దేశంలో బీజేపీని ఎదుర్కొగలరా అని ఒక్కసారి ఆలోచించాలన్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న సునీత మహేందర్‌రెడ్డి ఇద్దరు కూడా నాన్‌లోకలన్నారు. ఎన్నికలు అయిపోగానే ఇద్దరూ ఇక్కడ ఉండరన్నారు. అందువల్ల బీఆర్‌ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. 

ఎములాడకు ఏమిచ్చారు?

ఉత్తర కాశీని అందంగా తీర్చిదిద్ది.. దక్షిణ కాశీగా భావించే వేములవాడకు ఏమిచ్చారని ప్రధాని నరేంద్ర మోదీని కేటీఆర్ ప్రశ్నించారు. బుధవారం వేములవాడలో మోదీ బహిరంగ సభకు హాజరైన నేపథ్యంలో ఎక్స్ వేదికగా కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. పదేళ్ల బీజేపీ పాలనలో తెలంగాణ ప్రజలకు అన్యాయాలు, అవమానాలు, అవహేళనలే దక్కాయని విమర్శించారు. వరంగల్ జిల్లాకు మరోసారి వచ్చారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ హామీని మాత్రం మరిచారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని మరోసారి బొందపెటారు అని ఆగ్ర హం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సాక్షిగా తల్లిని చంపి బిడ్డను బతికించారని తెలంగాణ ఏర్పాటుపై మోదీ అన్న మాటలను కేటీఆర్ గుర్తు చేశారు.

ఏడు మండలాలను లాక్కొని అన్యా యం చేశారన్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాకట, ఏపీ ప్రాజెక్టులకు జాతీ య హోదా ఇచ్చి తెలంగాణకు మా త్రం అన్యాయం చేశారని దుయ్యబట్టారు. పదేళ్లుగా మోదీ భజన తప్ప విభజన హామీలను సాధించని బీజేపీ ఎంపీలకు మళ్లీ ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు. లక్షలాది మం దికి ఉపాధినిచ్చే ఐటీఐఆర్ ప్రాజెక్టును ఆగం చేసిన బీజే పీకి బుద్ధి చెప్పేందుకు యువత సిద్ధంగా ఉందన్నారు. డబుల్ ఆర్ టాక్స్ వసూలు చేస్తున్న చోటా భాయ్‌పై చర్యలు తీసుకోవడానికి ఎందుకు వెనుకాడుతున్నారని ప్రశ్నించారు.