calender_icon.png 8 July, 2025 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ రాజరాజేశ్వరికి శాకాంబరీ ఉత్సవాలు

03-07-2025 02:01:07 AM

కొత్తపల్లి, జూలై 2 (విజయక్రాంతి):కరీంనగర్ పట్టణం లోని నూతన 4వ డివిజన్ దుర్షెడ్ లో శ్రీ విశ్వంభరీ పీఠం ఆధ్వర్యంలో గల శ్రీ మరకత లింగ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా శాకాంబరీ ఉత్సవాలు ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో ఘ నంగా నిర్వహించడం జరిగింది.

వేకువ జామునే శ్రీ మరకత లింగానికి విశేష అభిషే కం నిర్వహించి, అనంతరం భక్తులు సమర్పించిన 108 రకాల పండ్లు కూరగాయలు, పూలతో శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి ప్ర త్యేక పూజలు చేసి పండ్లు, పూలు, కూరగాయలతో అమ్మవారికి అలంకరణ చేశారు.ఈ కార్యక్రమంలోఆలయ అర్చకులు దేవరాజు, ప్రశాంత్ శర్మ, శ్రీనివాస్ శర్మ, విశాల్ శర్మ, దేవాలయ చైర్మన్ నందాల తిరుపతి, మాజీ ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్ రావు, నా యకులు సాయిని తిరుపతి , గౌడ నర్సయ్య, అధిక సంఖ్యలో భక్తులుపాల్గొన్నారు.