03-07-2025 02:03:27 AM
టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి
తిమ్మాపూర్, జూలై 2 (విజయక్రాంతి): ఇరిగేషన్ శాఖలో ఎందరో మన్ననలు పొంది ప్రాజెక్టుకు సి ఈ శంకర్ ఎనలేని చేసిన సేవలు చిరస్మనీయంగా నిలిచిపోతాయని ఇంజనీర్ ఇన్ చీఫ్ మధుసూదన్ రావు కొనియాడారు.కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండి కాలనీలో గల ఇంజనీర్ ఇన్ చీప్ పరిపాలన నీటిపారుదల శాఖలో సి సీఈగా శంకర్ పనిచేసి పదవి విరమణ పొందిన ఆయనకు పదవి విరమణ సన్మాన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ టీఎన్జీవోల జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి సంఘం లక్ష్మణరావు, ఆధ్వర్యంలో పదవి విరమణ సన్మాన మహోత్సవంలో పాల్గొని ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంప్లాయిస్ జేఏసీ చైర్మన్ దారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగికి పదవి విరమణ అనేది సహజమే అని ఉద్యోగిగా చేసిన గుర్తుంటాయన్నారు.
ఉద్యోగిగా పదవి విరమణ పొందిన ఉద్యోగుల హృదయాల నుంచి విరమణ పొందలేదని విధి నిర్వహణలో అంకితభావంతో పని చేసి వృత్తినేదైవంగా భావించి ఎలాంటి సస్పెన్షన్ అవినీతి ఆరోపణలు లేకుండా పదవి విరమణ పొందడం ఆయన వృత్తికి వారు తీసుకొచ్చిన గౌరవం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాగి శ్రీనివాస్, రామచంద్రారెడ్డి, వెంకటేశ్వరరావు, మామిడి రమేష్, ప్రభాకర్, గంగార రమేష్ ,రవీందర్ రెడ్డి, సందీప్ రావు, అస్గర్, కయ్యం శ్రీనివాస్, హరికృష్ణ, యోగేందర్, లతోపాటు పలువురు ఉద్యోగులుపాల్గొన్నారు.