సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో షమీ
కోల్‌కత్తా, నవంబర్ 20 : టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ కీలక నిర్ణ యం తీసుకున్నాడు. జాతీయ జట్టులో రీఎం ట్రీ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న షమీ వ చ్చే నెలలో జరగనున్న దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడనున్నాడు. ఈ మేరకు బెంగాల్ క్రికెట్ అసోసి యేషన్‌కు సమాచారమిచ్చాడు. షమీ చివరిసారిగా మార్చిలో జరిగిన చాంపియన్స్ ట్రో ఫీలో భారత్ తరపున ఆడాడు. అయితే ఆసియాకప్‌తో పాటు ఇంగ్లాండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో సిరీస్‌లకు సెలక్టర్లు షమీని పక్కన పెట్టారు.
ప్రస్తుతం సౌతాఫ్రికాతో సిరీస్‌కు కూడా ఎంపిక చేయలేదు. దీంతో సెలక్ట ర్లపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన ఈ సీనియర్ పేసర్ ఇటీవలే రంజీ ట్రోఫీలో ఆడా డు. తన ఫిట్‌నెస్‌పై వచ్చిన సందేహాలకు తెరదించుతూ నాలుగు మ్యాచ్‌లు ఆడి 20 వికెట్లు పడగొట్టాడు. షమీ అద్భుత ప్రదర్శనతోనే బెంగాల్ జట్టు వరుస విజయాలతో గ్రూప్ సిలో అగ్రస్థానంలో నిలిచింది. తన ను కావాలనే ఎంపిక చేయడం లేదంటూ గతంలో చీఫ్ సెలక్టర్ అగార్కర్‌ను పరోక్షంగా విమర్శించిన షమీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశాడు.
సెలక్షన్ తన చేతుల్లో లేదని, ప్రస్తు తం బెంగాల్ జట్టుకు ఆడుతుండడమే తన పనిగా చెప్పుకొచ్చాడు. పలువురు యువ బౌలర్లు, సీనియర్లు జట్టులో ఉండడంతో షమీ రీఎంట్రీ ఇక కష్టమనే భావిస్తున్నారు. కాగా వచ్చే ఏడాది ఐపీఎల్‌లో షమీ లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడనున్నాడు. ఇటీవలే సన్‌రైజర్స్ షమీని 10 కోట్ల ధరకే లక్నోకు ట్రేడ్ చేసింది.




