calender_icon.png 21 November, 2025 | 12:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో దీప్తి శర్మ

21-11-2025 12:00:00 AM

డబ్ల్యూపీఎల్ వేలం

ముంబై, నవంబర్ 20 : వచ్చే వారం జరగనున్న వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలంలో భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ మర్కీ సె ట్‌లో చోటు దక్కించుకుంది. రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో ఆమె వేలం బరిలో నిలిచింది. మర్కీ గ్రూప్ సెట్‌లో 8 మంది ప్లేయర్స్‌కే చోటు దక్కింది. భారత్ నుంచి దీప్తి శర్మ, రేణుకా సింగ్(రూ.40 లక్షలు), లారా వా ల్వార్ట్(రూ.30 లక్షలు) బేస్ ప్రైస్‌తో ఉన్నా రు. ఇదే సెట్‌లో అలీసా హీలీ, సోఫీ డివైన్, సోఫీ ఎక్సెల్‌స్టోన్, అమెలియా కెర్, మెగ్ లా నింగ్(రూ.50 లక్షలు) బేస్‌ప్రైస్‌తో ఉన్నారు.

అలాగే భారత్ నుంచి క్రాంతి గౌడ్, హార్లిన్ డియోల్, ప్రతీకా రావల్, పూజా వస్త్రాకర్, ఉమా ఛెత్రితో పాటు 19 మంది ప్లేయర్స్ రూ.50 లక్షల బేస్ ప్రైస్‌తో ఉన్నారు. డబంగ్లాదేశ్‌కు చెందిన షోర్నా అక్తర్, విండీస్ ప్లే యర్ జాజ్రా క్లాక్స్‌టన్ ఈ సారి వేలంలో యంగెస్ట్ ప్లేయర్స్‌గా నిలిచారు. వేలంలో ఈ సారి ఫ్రాంచైజీలు రూ.41.1 ఓట్ల వరకూ వెచ్చించొచ్చు.