22-12-2025 10:53:52 AM
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Telangana Phone Tapping Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ రివ్యూ కమిటీలో ఉన్నవారిని సిట్ మరోసారి విచారించింది. రివ్యూ కమిటీలో ఉన్న వారికి సిట్ నోటీసులు ఇచ్చి విచారణ జరిపింది. గత ప్రభుత్వంలో తెలంగాణ మాజీ సీఎస్ సోమేశ్ కుమార్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ వాంగ్మూలాలను సిట్ రికార్డు చేసింది. మాజీ జీఏడీ సెక్రటరీ, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, అప్పటి న్యాయశాఖ కార్యదర్శిని సిట్ విచారించింది. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ నవీన్ చంద్ వద్దకు వెళ్లి వాంగ్మూలం రికార్డు చేసినట్లు అధికారులు తెలిపారు.
ఉన్నతాధికారులు చెబితేనే తాను చేశానని ప్రభాకర్ పోలీసులకు తెలిపాడు. అదే విషయాన్ని నవీన్ చంద్ ఎదుట ప్రభాకర్ రావును సిట్ ప్రశ్నించింది. అనుబంధ ఛార్జ్ షీట్ నమోదు చేసే యోచనలో సిట్ అధికారులు ఉన్నట్లు వర్గాలు తెలిపాయి. ప్రభాకర్ రావును ఎస్ఐబీ ఓఎస్డీగా ఎలా నియమించారనే అంశంపై సిట్ విచారించింది. ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరి నెంబర్లు ప్రభాకర్ రావు ఇచ్చారనే దానిపై నవీన్ చంద్‌ను ప్రశ్నించింది. నవీన్ చంద్ హయాంలో ఎస్ఐబీ చీఫ్‌గా ప్రభాకర్ రావు పని చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25తో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగియనుంది.