హిందువుల ఐక్యత కోసం ఆలయాల సందర్శన
అహోబిల రామానుజ జీయర్ స్వామి
సికింద్రాబాద్, జూలై 18 (విజయక్రాంతి): హిందువుల ఐక్యత కోసం ఆలయాల్లో జరిగే సమిష్టి ప్రార్థనలు, భజనలు,ఉత్సవాలు ప్రజలను ఒక తాటిపైకి తేవాలనే సంకల్పం తో భావితరాల వారికి మన సంస్కృతి, సాంప్రదాయాలు, మానవ విలువలను తెలియజేయడానికి దేవాలయాలు పలు దేవాలయాలను సందర్శిస్తున్నట్లు ప్రముఖ ఆధ్యాత్మిక గురువులు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి ముఖ్య శిష్యుడు శ్రీశ్రీశ్రీ అహోబిల రామానుజ జీయర్ స్వామి అన్నారు.
ఈ ఈ సందర్భంగా న్యూ బోయినపల్లి న్యూ సిటీ కాలనీ లో గల శ్రీ వెంకటేశ్వర్ స్వామి దేవాలయం ను శనివారం అహోబిల రామానుజ జీయర్ స్వామి అయన బృందం సందర్శించారు. ఈ సందర్బంగా ఆలయ కమిటీ సభ్యులతో కలిసి కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ , భాగ్యనగర్ గణపతి ఉచ్చవ కమిటీ సభ్యుడు మురారి,తోటు భక్తులు పెద్ద సంఖ్యలో స్వామి జీకి ఘనస్వాగతం పలికారు.ఈ నేపధ్యం లో అయన ఆలయం వెంకటేశ్వర స్వామి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులకు పలు సూచనలు సలహాలను ఇచ్చారు. అంతరం భక్తులకు ఆశీర్వచనాలు అందచేశారు. ఈ సందర్భాంగా అయన మాట్లాడుతూ హిందూ సంప్రదాయ దుస్తువులను ధరిస్తూ సంప్రదాయాలను పాటిస్తూ ఆలయాలకు రావాలని పిలుపు నిచ్చారు.తమ పిల్లకు చిన్నతనం నుండే భక్తి భావాలూ పెందించేలా చూడాలని పిల్లలను దేవాలయాలకు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, జగన్నాథం,సుమంత్ రెడ్డి,నారాయణ, లక్ష్మణ్,సాంబశివ రావు, ఆలయ అర్చకులు పవన్,శ్రీధర్,దీపక్, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






