calender_icon.png 24 May, 2025 | 1:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బతకకూడదని బావిలో పడేసింది

24-05-2025 01:05:47 AM

- కిడ్నాప్ కథ అల్లి నమ్మించే ప్రయత్నం

- పోలీసుల విచారణలో వెలుగు చూసి నిజాలు 

సిద్దిపేట, మే 23 (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం అప్పనపల్లి గ్రామంలో రెండు నెలల బాలుడు కిడ్నాప్ చేసిన అనుమానాలను నిగ్గుతేల్చారు. ఇంటి ముందు కూర్చుంటే ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి బైకులపై వచ్చి మాట్లాడుతూ బాలుడిని కిడ్నాప్ చేశారంటూ కవిత చెప్పిన వివరాలతో కేసు నమోదు చేసి విచారణ జరిపిన దుబ్బాక పోలీసులు నిజా నిజాలు వెలికి తీశారు.

రామగల శ్రీమన్ కవిత దంపతులు రెండు నెలల కుమారునితో అప్పనపల్లి గ్రామంలో బంధువుల ఇంట్లో నివాసం ఉంటున్నారు. రెండు నెలల క్రితం కవిత పండంటి బాలునికి జన్మనిచ్చింది. అయితే  శ్రీమన్ పలు దొంగతనాల కేసులలో అరెస్టయి జైలుకు వెళ్లి ఇటీవలే బయటకు వచ్చాడు. దాంతో వారి సొంత గ్రామమైన పుల్లూరులో ఉండటం అవమానంగా భావించి సమీప బంధువుల గ్రామంలో నివాసముంటున్నారు.

భర్త చెడు పనుల వల్ల అవమానంగా ఉందని తన బిడ్డ కూడా పెరిగి అవమానాలకు గురవుతాడు అనుకోని తన భర్తకి దూరంగా ఉండాలనే ఆలోచనతో తానే తన బిడ్డను బావిలో పడేసినట్లు పోలీసులకు వివరించింది. కవిత మానసిక విధానం బాగోలేదని అనారోగ్యంగా ఉందని తనకు చికిత్స అందించాలని పోలీసులు కుటుంబ సభ్యులకు వివరించారు.