24-05-2025 01:07:29 AM
కూకట్‌పల్లి మే 23 (విజయక్రాంతి): కరోనా మహమ్మారి జడలు విప్పుతోంది. దేశవ్యాప్తంగా కొద్ది రోజుల నుంచి కేసులు నమోదవు తున్నాయి. తాజాగా శుక్రవారం హైదరాబాద్ నగరంలో తొలి కేసు నమోదయింది. హైదరాబాద్ నగరంలోకి కూకట్‌పల్లి వివేకానంద నగర్ కాలనీకి చెందిన ఓ డాక్టర్‌కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఆ డాక్టర్ కొద్ది రోజుల నుంచి జలుబు, దగ్గుతో బాధపడుతున్నాడు.
అతడికి సోకింది కొత్త వేరియంటా? లేక పాత వైరస్సేనా? అనే విషయం తెలియలేదు. హైదరాబాద్‌లో కూడా కరోనా వెలుగు చూడటంతో ప్ర జలంతా బెంబేలెత్తిపోతున్నారు. ప్ర జలు ఆందోళన చెందాల్సిన అవస రం లేదని, అప్రమత్తంగా ఉండాల ని వైద్యారోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
బెంగళూరులో 9 నెలల చిన్నారికి..
మరోమారు కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేస్తోం ది. కొత్త వేరియంట్ జేఎన్ 1 ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా భయపెడుతోంది. మేలోనే కోరలు చా స్తూ కొత్త సవాల్ విసురుతోంది. కర్ణాటకలో ఏప్రిల్ వరకు పది కేసు లు వెలుగుచూడగా.. ఒక్క మేలోనే 33 కేసులు వచ్చాయి.
ఇంకా మే నెల పూర్తికానే లేదు. బెంగళూరు రూరల్ జిల్లాలోని హోస్కటే ప్రాం తానికి చెందిన ఓ తొమ్మిది నెలల చిన్నారికి కూడా పాజిటివ్‌గా తేలిం ది. ప్రస్తుతం కర్ణాటకలో 16 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా రో జురోజుకూ కరోనా విజృంభిస్తుండటంతో జనాలు భయబ్రాంతులకు గురవుతున్నారు.