02-08-2025 01:34:05 AM
గొర్రెల పంపిణీ కుంభకోణం 1000 కోట్ల పైనేనని ఈడీ అంచనా
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (విజయక్రాంతి): రాష్ర్టంలో సంచలనం సృ ష్టించిన ‘గొర్రెల పంపిణీ పథకం’లో భారీ గా ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ధృవీకరించిం ది. ఈ కుంభకోణం విలువ రూ.1000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేసిం ది. మనీలాండరింగ్ నిరోధక చట్టం 2002, నిబంధనల కింద గురువారం హైదరాబాద్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది.
అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్‌తో సం బంధం ఉన్న 200లకు పైగా అనుమానిత డమ్మీ, మ్యూల్ ఖాతాలకు సంబంధించిన ఖాళీ చెక్ పుస్తకాలు, పాస్‌బుక్‌లు , డెబిట్ కార్డులతో సహా అనేక బ్యాంకు ఖాతాల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ దాడుల్లో భాగంగా, గత ప్రభుత్వంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన తలసా ని శ్రీనివాస యాదవ్‌కు ప్రత్యేకాధికారి(ఓఎస్డీ)గా వ్యవహరించిన జీ కల్యాణ్ కుమా ర్ నివాసంతో పాటు, ఈ కుంభకోణంలో లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కొందరు వ్యక్తులు, మధ్యవర్తుల ఇళ్లలోనూ సోదాలు జరిగాయి.
సంబంధం లేని ఖాతాలకు మళ్లింపు
అవినీతి నిరోధక శాఖ ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారం గా ఈడీ ఈ దర్యాప్తును ప్రారంభించింది. రాష్ర్టంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరా ్వత, మాజీ మంత్రి ఓఎస్డీ కార్యాలయం తాళాలు పగలగొట్టి కొన్ని రికార్డులను తొలగించారని ఒక ఎఫ్‌ఐఆర్‌లో ఆరోపణలు ఉన్నాయి. గొర్రెల యూనిట్ల సరఫరాకు గాను తమకు చెల్లించాల్సిన రూ. 2.1 కోట్లను శాఖాపరమైన అసిస్టెంట్ డైరెక్టర్లు ఇతర సంబంధం లేని ఖాతాలకు మళ్లించి అపహరించారని గొర్రెల వ్యాపారులు ఫిర్యాదు చేయడంతో మరో కేసు నమోదైంది.
కాగ్ నివేదికలో అవకతవకల వెల్లడి
మార్చి 2021తో ముగిసిన కాలానికి కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) సమర్పించిన ఆడిట్ నివేదిక ఈ పథకం అమలులో అనేక లోపాలను ఎత్తిచూపింది. లబ్ధిదారుల వారీగా వివరాలు సరిగ్గా నిర్వహించకపోవడం, రవాణా ఇన్వాయిస్‌లు, చెల్లింపుల రికార్డులు సక్రమంగా లేకపోవడం, నకిలీ ప్యాసింజర్ వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు ఉన్న ఇన్‌వాయిస్‌లపై చెల్లింపులు జరపడం వంటి అనేక అవకతవకలను కాగ్ గుర్తించింది.
అంతేకాకుండా గొర్రెల యూనిట్లకు నకిలీ ట్యాగ్‌లు కేటాయించడం, చనిపోయిన లేదా ఉనికిలో లేని వ్యక్తులకు యూనిట్లు కేటాయించడం వంటి మోసాలు కూడా జరిగినట్లు నివేదిక పేర్కొంది. ఈ కాగ్ ఆడిట్ కేవలం 7 జిల్లాలకు మాత్రమే పరిమితం కాగా, ఈ జిల్లా ల్లోనే ప్రభుత్వానికి రూ. 253.93 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. రాష్ర్టంలోని మొత్తం 33 జిల్లాలకు దామాషా పద్ధతిలో లెక్కిస్తే, ఈ నష్టం రూ. 1000 కోట్లు దాటే అవకాశం ఉందని ఈడీ భావిస్తోంది.
ఈడీ దర్యాప్తులో వెలుగులోకి నిజాలు
ఈడీ దర్యాప్తులో షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. పథకంలో లబ్ధిదారులకు గొర్రెల సరఫరా కోసం అనేక మంది వ్యక్తులు/సంస్థల బ్యాంకు ఖాతాలకు భారీగా నిధులు బదిలీ అయ్యాయి. అయితే ఈ పథకం ప్రారంభానికి ముందు వారికి గొర్రె ల వ్యాపారంతో ఎటువంటి సంబంధం లేద ని తేలింది.
అంతేకాకుండా ఈ నిధులు పొం దిన వారు ఎప్పుడూ గొర్రెలను కొనుగోలు చేయడం లేదా విక్రయించడం చేయలేదని దర్యాప్తులో వెల్లడైంది. దీనివల్ల ప్రభుత్వ నిధులు నకిలీ విక్రేతల ఖాతాలకు మళ్లాయ ని ఈడీ నిర్ధారించింది. ఆడిట్ నివేదికలో పే ర్కొన్నట్లుగానే, నకిలీ విక్రేతలకు చెల్లింపులు జరిగాయని, అలాగే ఒకే గొర్రెల యూ నిట్‌ను పలుమార్లు సరఫరా చేసినట్లు చూపిం చి డబ్బులు కాజేశారని ఈడీ గుర్తించింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్‌తో సంబంధం
సోదాల్లో భాగంగా, వివిధ ప్రభుత్వ అధికారులు,ఇతరులకు కిక్‌బ్యాక్‌ల రూపంలో అక్రమ చెల్లింపులు జరిపినట్లు సూచించే కీలకమైన పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఒక ప్రాంగణంలో, అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ అప్లికేషన్‌తో సంబంధం ఉన్న 200లకు పైగా అనుమానిత డమ్మీ,మ్యూల్ ఖాతాలకు సంబంధించిన ఖాళీ చెక్ పుస్తకాలు, పాస్‌బుక్‌లు , డెబిట్ కార్డులతో సహా అనేక బ్యాంకు ఖాతాల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ కార్యకలాపాల నిర్వహణకు ఉపయోగించినట్లు అనుమానిస్తున్న 31 మొబైల్ ఫోన్లు, 20కి పైగా సిమ్ కార్డులను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కుంభకోణంపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.