calender_icon.png 2 August, 2025 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎంఆర్‌ఎఫ్ పేద,మధ్యతరగతి ప్రజలకు వరం

02-08-2025 01:32:44 AM

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ

శేరిలింగంపల్లి, ఆగస్ట్ 1:శేరిలింగంపల్లి ని యోజకవర్గం పరిధిలోని పలువురు వైద్య చి కిత్స నిమిత్తం ముఖ్య మంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకొనగా 51 మంది లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్ ద్వారా మంజూరైన రూ. 30,67,000/- ముప్పు లక్షల అరవై ఏడు వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కులను శుక్రవారం కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు,రఘునాథ్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ అందజేశారు.

ఈ సం దర్భంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేద మధ్యతరగతి ప్రజలకు వరమని, ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృ షి చేస్తుందని ఎమ్మెల్యే గాంధీ అన్నారు.

ము ఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్నవారికి ఆపన్నహస్తంలా ఆదుకుంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంజీవ రెడ్డి,నాయి నేనీ చంద్రకాంత్ రావు, పోతుల రాజేందర్ , ఎండి ఇబ్రహీం, ఎల్లం నాయుడు, శ్రీధర్ రెడ్డి, రాంచందర్, భాస్కర్ రెడ్డి,వెంకటేశ్వర రావు తదితరులుపాల్గొన్నారు.