02-08-2025 01:34:58 AM
బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి
వికారాబాద్ ఆగస్టు- 1 (విజయక్రాంతి ) రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ జనహిత పాదయాత్ర ఓ నాటకమని, అ ధికార పార్టీలో ఉండి పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందని భారతీయ జనతా పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ రెడ్డి, మాజీ అధ్యక్షులు సదానంద్ రెడ్డి లు ఆరోపించారు. శుక్రవారం వికారాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడు తూ ఏ రాష్ట్రంలో అయినా ప్రజా ప్రతినిధు లు ఆ ప్రాంతంలో ప్రజా సమస్యల పరిష్కా రం కోసం లేదా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేయడం సహజమన్నా రు.
సహజంగా పాదయాత్ర ప్రతిపక్ష పా ర్టీలు నిర్వహిస్తాయని, కానీ అధికార పార్టీ నాయకులు పాదయాత్ర చేయడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని, పార్టీలోని ఇతర ముఖ్య నాయకులను పక్కనపెట్టి ఇతర రాష్ట్రానికి చెందిన మీనాక్షి నట రాజన్ పాదయాత్రను తన ఆధ్వర్యంలో ని ర్వహించడం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లోనే గందరగోళం ఏర్పడిందన్నారు.
ఈ జిల్లాకు చెందిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి ఈ రెండేళ్ల కాలంలో ఏమీ ఒరగబెట్టారో ముందుగా మీనాక్షి నటరాజన్ జిల్లా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. జి ల్లాలో రోడ్లు అద్వానంగా ఉన్న ఏ నాయకు డు పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. వికారాబాద్, తాండూరు రోడ్డు దుస్థితిని పాదయాత్ర సందర్భంగా మీనాక్షి నటరాజన్ చూడాల్సి ఉండే నన్నారు.
కాం గ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన అనే క హామీలను నెరవేర్చకుండా ఒకటి రెండు హామీలను మాత్రమే నెరవేర్చి గొప్పలు చె ప్పుకోవడం దారుణమన్నారు. మహాలక్ష్మి ప థకం కింద మహిళలకు ఇస్తానన్న 2005 ప థకం ఏమైందని, ఆడపిల్ల పెళ్లికి తులం బం గారం ఎక్కడ ఇచ్చారని, రైతులకు 24 గంట ల ఉచిత కరెంటు ఎక్కడ అందించారో పాదయాత్ర సందర్భంగా ప్రజలకు చెప్పింటే బా గుండేది అన్నారు.
42 శాతం బిసి రిజర్వేష న్లు ఇస్తామంటూ ప్రజలను కాంగ్రెస్ పార్టీ త ప్పుదోవ పట్టిస్తున్నట్లు ఆరోపించారు. కుల రాజకీయాలతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి లబ్ధి పొందాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్లు వారుఆరోపించారు.