20 June, 2026 | 4:04 PM

Breaking News

పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా 24 గంట కౌంట్‌డౌన్ కార్యక్రమం   •   రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న కేటీఆర్   •   హైదరాబాద్ రోడ్డుకి ట్రంప్ పేరు పెట్టడాన్ని నిరసిస్తూ నల్ల జెండాలతో ప్రదర్శన   •   'పది'లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకం   •   జనపనార పైలెట్ ప్రాజెక్టు పై అవగాహన సదస్సు   •   23న రాష్ట్ర వ్యాప్త పాఠశాలల బంద్   •   అనురాగ్ లో 5రోజుల ఉపాధ్యాయ శిక్షణా తరగతులు ప్రారంభం   •   ఎస్‌ఐఆర్ విజయవంతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   కలెక్టర్ కోయ శ్రీహర్షను అభినందించి, సన్మానించిన ప్రభుత్వ విప్ విజయరమణ రావు   •   జ్యోతినగర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి   •  

భూ భారతి భూ సర్వేలో మండలంలో రెండో గ్రామంగా శేరి దామరగిద్ద

20-06-2026 02:41 PM

నాగలిగిద్ద,(విజయక్రాంతి): నాగలిగిద్ద మండల పరిధిలోని శేరి దామరగిద్ద గ్రామంలో భూ భారతి భూ సర్వే కార్యక్రమానికి సంబంధించి గ్రామ సభ, అవగాహన సదస్సు శనివారం నిర్వహించారు. మండలంలో భూ భారతి భూ సర్వే చేపట్టిన రెండో గ్రామంగా శేరి దామరగిద్ద గుర్తింపు పొందింది. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ (ఎంఆర్వో) సంగ్రామ్ రెడ్డి, ఎంపీడీవో మహేశ్వర రావు, ఎంఈఓ మన్మధ కిషోర్, జీపీఓ సునీత, ఆర్ఐ అనిల్ రెడ్డి, సర్వేయర్ నర్సింలు పాల్గొని భూ సర్వే ప్రక్రియ, భూ రికార్డుల సవరణ, భూముల వివరాల నమోదు విధానం గురించి గ్రామస్థులకు వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి భూ భారతి కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు.

గ్రామ సర్పంచ్ మల్గే రాజు, ఉపసర్పంచ్ పండరి మాట్లాడుతూ గ్రామ ప్రజలు భూ సర్వే కార్యక్రమానికి పూర్తి సహకారం అందించి తమ భూముల వివరాలను సక్రమంగా నమోదు చేయించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు భూ భారతి కార్యక్రమం లక్ష్యాలు, ప్రయోజనాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అంగన్వాడి టీచర్ నిర్మలా, పుణ్యవతి గ్రామ ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్థులు, రెవెన్యూ సిబ్బంది, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. గ్రామస్థులు తమ సందేహాలను అధికారులను అడిగి నివృత్తి చేసుకున్నారు.