calender_icon.png 10 December, 2025 | 3:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ష్.. గప్.. చుప్..!

10-12-2025 12:00:00 AM

  1. గుట్ట కింది గ్రామాలు గుప్పు మంటున్నాయి
  2. రేపు 380 గ్రామాల్లో పోలింగ్
  3. మండలాల్లో నిషేధాజ్ఞలు అమలు: మద్యం దుకాణాలు మూసివేత

కరీంనగర్, డిసెంబర్ 9(విజయక్రాంతి): కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఈనెల 11వ తేదీన (గురువారం) జరగనున్న తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా, ఎన్నికల ప్రచారంపై అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. తొలి విడత ఎన్నికలు జరి గే ఉమ్మడి జిల్లాలోని 380 గ్రామ పంచాయతీల్లో 1526 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పిద్దపల్లి జిల్లాలో 95, జగిత్యాల జిల్లాలో 118, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 78 పంచాయతి లలో, కరింనగర్ జిల్లా చొప్పదండి, గంగాధర, రామడుగు, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి అనే ఐదు మండలాల పరిధిలో ని 89 పంచాయతిలలోమంగళవారం సాయంత్రం 5:00 గంటలకు ప్రచారం ము గిసింది.

అభ్యర్థులు తమ ప్రచారాన్ని ము గించి డబ్బుల పంపకం పై దృష్టి సారించారు.ఎన్నికల సజావుగా నిర్వహణ కోసం ఇప్పటికే నిషేధాజ్ఞలు మంగళవారం సా యంత్రం 5 గంటల నుండి (Sec 163 బి ఎ న్ ఎస్ ఎస్) అమలులోకి వచ్చాయి. ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమి గూడటం నిషేధం విధించారు.

పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఈ ప్రాంతాలలో అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు. మొదటి విడత పోలింగ్ డిసెంబర్ 11వ తేదీ, గురువారం ఉదయం 7:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు నిర్వహించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం, అదే రోజు (డిసెంబర్ 11నాడు) సాయంత్రం ఓట్ల లెక్కింపు ఫలితాల వెల్లడి జరుగుతుంది.

గుప్పుమంటున్న గుట్టకింది పల్లెలు...

గ్రానైట్ గుట్టలు విస్తరించిన ఉన్న పల్లెల్లో పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతుంది. గుట్టకింది గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుంది. కరీంనగర్ జిల్లా మొదటి విడకలు ఎన్నికలు జరగనున్న గంగాధర మండలం గర్షకుర్తి, మధురానగర్, గట్టుబుత్కూర్, ఒద్యారం, ఆచంపల్లి, నర్సింహుల పల్లిలాంటి గ్రామాల్లో అభ్యర్థులు మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఇక్కడ పోటీచేసే అభ్యర్థులు కోటి రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు.

అలాగే ఇక్కడ చాలా చోట్ల గ్రానైట్ వ్యాపారులే గెలిచే అభ్యర్థులకు డబ్బులు అందజేశారు. అలాగే మధురానగర్, బూరుగుపల్లి, గరకుర్తి గ్రామాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం వేగంగా పెరుగుతుండడంతో ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులు కూడా పోటీపడి ఖర్చు పెడుతున్నారు.

గంగాధర మండల కేంద్రంలో జరిగే వారసంత ద్వారా పంచాయతీకి ఏటా కోటిన్నర రూపాయల ఆదాయం వరకు వస్తుంటుం ది. ఇక్కడ కూడా అభ్యర్థులు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. కొత్తపల్లి మండలం ఎలగందుల, బావుపేట, ఖాజీపూర్, కమాన్పూర్, బద్దిపల్లి, నాగులమ ల్యాల గ్రామాల్లో గ్రానైట్ విస్తరించిన ఉండడంతో ఆయా గ్రామాల్లో అభ్యర్థులు పోటీప డి ఖర్చుపెడుతున్నారు.