10-12-2025 12:00:00 AM
వేములవాడ,డిసెంబర్ 09 (విజయ క్రాంతి): డిసెంబర్ 9ను ‘విజయ్ దివస్’గా గుర్తిస్తూ వేములవాడలో బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. పింక్ బెలూన్లు విడుదల చేసి ఘనంగా సంబరాలు జరిపారు.ఈ సందర్భంగా నాయకులు ఎనుగు మనోహర్ రెడ్డి, నిమ్మశెట్టి విజయ్, రామతీర్థపు రాజు మాట్లాడుతూ 2009 డిసెంబర్ 9న కేసీఆర్ ఆమరణ దీక్షకు కేంద్రం తలొగ్గి తెలంగాణ ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభించిన రోజే ఇది అని తెలిపారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న భక్తులకు, యాచకులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్ నేతలు పాల్గొన్నారు.