ప్రజావాణి దరఖాస్తులు పరిష్కరించాలి
30-06-2026 01:20 AM
కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, జూన్ 29(విజయ క్రాంతి) : సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా మెదక్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ , అదనపు కలెక్టర్ నగేష్ లు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణి లో 83 దరఖాస్తులను స్వీకరించారు. అందులో భూ భారతి 33, ఇందిరమ్మ ఇండ్లు 14, పెన్షన్లు 4, సాధారణ 32, మొత్తం 83 దరఖాస్తుల స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తక్షణమే ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలన్నారు.






