16-02-2026 12:21:25 AM
శంకర్ పల్లి, ఫిబ్రవరి 15: మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం శంకర్ పల్లి మండలంలోని చందిప్ప గ్రామంలో వెలసిన మరకత శివాలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుండి ఉపవాసాలు ఉన్న భక్తులు సాయంత్రం వేళ దేవాలయానికి చేరుకొని మరగత శివలింగానికి పూజలు నిర్వహించారు. అలాగే శంకర్ పల్లి గంజి రోడ్ లో ఉన్న శ్రీ విఠలేశ్వర హనుమాన్ దేవాలయంలో వెలసిన స్పటిక లింగ రూప శ్రీ కాశీ విశ్వనాథ్ స్వామివారికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకొని పూజలు నిర్వహించారు.
మున్సిపల్ పరిధిలోని చిన్న శంకర్ పల్లి గ్రామంలో వెలసిన శ్రీ రాజరాజేశ్వర దేవాలయంలో ఉన్న శివలింగానికి భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వచ్చిన భక్తులకు దేవాలయం కమిటీ వారు పండ్లను ఉచితంగా సాయంత్రం వేళ పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా మహిళ అధ్యక్షురాలు శ్రీ జ్యోతి, భీమ్ భరత్ బ్రహ్మ ముహూర్తంలో చందిప్ప గ్రామంలో తెలిసిన మరకత శివలింగానికి పూజలు చేశారు. పఠాన్‌చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్‌రెడ్డి కూడా ప్రత్యేక పూజలు చేశారు.