9 June, 2026 | 1:23 AM

హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అమర్నాథ్‌కు షాక్

09-06-2026 12:00 AM

నియామకం చెల్లదన్న హైకోర్టు

కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సెక్రటరీకి ఆదేశం

హైదరాబాద్, జూన్ 8: హైదరాబాద్ క్రికెట్ అసోయేషిన్ అధ్యక్షుడు అమర్నాథ్‌కు షాక్ తగిలింది. ప్రెసి డెంట్‌గా ఆయన నియమాకంపై తెలంగాణ హైకోర్ట్ సం చలన తీర్పు వెల్లడించింది. అమర్నాథ్ నియమాకం చెల్లదని, ప్రెసిడెంట్ పదవి నుంచి తొలిగించాలని హెచ్‌సీఏ కార్యదర్శి జీవన్ రెడ్డిని ధర్మాసనం ఆదేశించింది.

స్పెషల్ ఏజీఎం నిర్వహించి కొత్త అధ్యక్షుడిని వెంటనే ఎన్నికోవాలని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో హెచ్‌సీఏ నూతన అధ్యుక్షుడిగా అమర్నాథ్ పేరును  రిటైర్డ్ చీఫ్ జస్టిస్, ప్రస్తుత అంబుడ్స్‌మన్ సురేష్ కుమార్ కైత్ ప్రకటించారు. 2023లో జరిగిన ఎన్నికల్లో జగన్‌మోహన్ రావు చేతిలో అమర్నాథ్ కేవలం ఒక్క ఓటుతో ఓడిపోయాడు. 

అయితే ఆ ఎన్నికల్లో విజయం సాధించిన జగన్‌మోహన్ రావు అవినీతి ఆరోపణలు కేసులో అరెస్ట్ కావడంతో ప్రెసిడెంట్ పదవి నుంచి అతడిని తప్పించారు. ఆ స్ధానంలో రెండో స్థానంలో నిలిచిన అమర్నాథ్‌కు బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి హెచ్‌సీఏ ప్రెసిడెంట్ హోదా లో అమర్నాథ్ కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన ఎంపిక కూడా చెల్లదని కోర్ట్ తీర్పునివ్వడంతో మరోసారి హెచ్‌సీఏ ప్రెసెడింట్ పదవికి ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్వరలోనే ప్రత్యేక ఏజీఎం సమావేశాన్ని నిర్వహించి కొత్త ప్రెసిడెంట్‌ను ఎన్నుకోనున్నారు.