14-12-2025 06:02:26 PM
ఆస్ట్రేలియా: సిడ్నీ(Sydney) నగరంలోని పర్యాటక ప్రాంతమైనా బాండి బీచ్(Bondi Beach)లో ఆదివారం సాయంత్రం కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 10 మంది మరణించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో ఈ కాల్పులు జరిగాయి. ఈ ఘటనతో వందలాది మంది పర్యాటకులు, స్థానికులు భయాందోళనకు గురై ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రసిద్ధ బీచ్ ఫ్రంట్ ప్రాంతం నుంచి పారిపోయారు. బాండి బీచ్‌లో జరిగిన ఘటనపై ఆస్ట్రేలియా పోలీసులు స్పందించారు. ప్రజలు ఘటన ప్రాంతానికి దూరంగా ఉండాలని సౌత్ వేల్స్ పోలీసులు సోషల్ మీడియాలో ఒక ప్రకటనలో తెలిపారు.
సంఘటనా స్థలంలో ఉన్న వారందరూ సురక్షిత ప్రాంతంలో ఆశ్రయం పొందాలని వారు సూచించారు. కాగా, ఈ కాల్పుల్లో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని, ఆపరేషన్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రజలు బీచ్ ప్రాంతానికి దూరంగా ఉండి.. పోలీసు సూచనలను పాటించాలని పేర్కొన్నారు. అలాగే పోలీసు సరిహద్దులను ఎట్టిపరిస్థితుల్లో దాటవద్దని హెచ్చరించారు. ఆస్ట్రేలియా పత్రికల ప్రకారం.. ఒక అనుమానిత షూటర్‌ను పోలీసులు కాల్చి చంపగా, మరొకరిని అదుపులోకి తీసుకున్నారు. తూర్పు సిడ్నీలోని బాండి బీచ్ ఆస్ట్రేలియాలోని అత్యంత ప్రసిద్ధ బీచ్‌లలో ఒకటి. ముఖ్యంగా వీకెండ్స్ లో ఇది సర్ఫర్లు, ఈతగాళ్ళు, పర్యాటకులను ఆకర్షిస్తుంది.