11-08-2025 08:27:21 AM
హైదరాబాద్: నేటి నుంచి టాలీవుడ్‌లో(Tollywood) షూటింగ్స్ బంద్ చేస్తున్నట్లు ఫిలిం ఫెడరేషన్ ప్రకటించింది. ఫిలిం ఫెడరేషన్‌కు వేతనాల పెంపుకు సమ్మతించిన నిర్మాతల షూటింగ్స్ కూడా బంద్ అయ్యాయి. శుక్రవారమే ఫెడరేషన్ కు సహకరించకుండా షూటింగ్స్ బంద్ చేయాలని నిర్మాతలకు ఫిలిం ఛాంబర్ ఆదేశించింది. నేటి నుంచి ఎక్కడిక్కక్కడ షూటింగ్స్(Shootings) నిలిచిపోనున్నాయి. తెలుగు సినీ కార్మికులు వేతనాల పెంపు డిమాండ్ చేస్తూ తమ నిరసనను తీవ్రతరం చేయగా, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సోమవారం నుండి సినిమా షూటింగ్‌లను నిలిపివేస్తామని ఇప్పటికే తెలియజేసింది.
ఆదివారం ఫెడరేషన్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. పెద్ద సంఖ్యలో కార్మికులు(Film workers) అక్కడ గుమిగూడి తమ డిమాండ్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. 24 యూనియన్లకు చెందిన కార్మికులు ఈ నిరసనలో పాల్గొన్నారు. అన్ని యూనియన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ నాయకులు, నిర్మాతలతో జరిపిన చర్చలు సానుకూల ఫలితాలను ఇవ్వకపోతే సినిమా షూటింగ్‌లను(Movie shootings) పూర్తిగా నిలిపివేస్తామని తెలిపారు. ఇప్పటికే ప్రకటించిన సినిమా షూటింగ్ షెడ్యూల్‌లకు రెండు రోజులు సమయం ఇస్తామని చెప్పారు. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన నిర్మాతలతో కూడా మాట్లాడి సినిమా షూటింగ్‌ను నిలిపివేస్తామని ఫెడరేషన్ అధ్యక్షుడు పేర్కొన్నారు.