calender_icon.png 13 August, 2025 | 11:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యాయం కోసం దూరం వెళ్లాలా..?

11-08-2025 12:42:20 AM

  1. కొత్త భవనాల స్థలం ఎంపిక  వివాదం
  2. నిర్మల్ పట్టణంలోని నిర్మించాలని బార్ అసోసియేషన్ తీర్మానం
  3. జిల్లాలో న్యాయవాదుల పోరాటం

నిర్మల్ ఆగస్టు 10 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించి కోర్టు సముదాయాల భవన నిర్మాణం స్థలం ఎంపిక వివాదమవుతుంది. నిర్మల్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో సారంగాపూర్ మండలంలోని చించోలి గ్రామ శివారులో కోర్టు సముదాయాల భవనానికి రెవెన్యూ అధికారులు ఐదు ఎకరాల స్థలానికి కేటాయించారు.

నిర్మల్ జిల్లా కేంద్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకేచోట కోర్టు సముదాయిక భవనాలను న్యాయమూర్తుల రెసిడెన్షియలను నిర్మించాలని ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది

నిర్మల్ జిల్లా కూడా రూపాయలు 80 కోట్లు ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో భవన నిర్మాణానికి కావలసిన స్థలం కేటాయించాలని న్యాయశాఖ రెవిన్యూ అధికారులకు సూచించింది. రెండు సంవత్సరాల నుంచి నిర్మల్ లో ఓటు భవన సముదాయానికి అవసరమయ్యే స్థలం ఎంపిక కోసం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవిన్యూ ల్యాండ్ రికార్డ్ సర్వే అధికారులు సర్వే నిర్వహించి మూడు ప్రదేశాల్లో ఎంపిక చేశారు.

గత ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా వ్యవహరించిన నిర్మల్ జిల్లాకు చెందిన ఏ ఇంద్రకన్ రెడ్డి ప్రత్యేక కృషితో ఈ నిధులు మంజూరు కాగా సోఫీ నగర్ చించోలి బి కొండాపూర్ శివారు ప్రాంతాల్లో కోర్టు సముదాయిక భవనాల నిర్మాణానికి అవసరమయ్యే స్థలం కేటాయించగా అక్కడ కోర్టు భవనాలు నిర్మించేందుకు స్థలం సరిపోకపోవడంతో అధికారులు చించోలి బి గ్రామం వద్ద ప్రభుత్వ భూమి ఉందని గుర్తించి కేటాయించారు

దూరంలో నిర్మిస్తే ఇబ్బంది

నిర్మల్ జిల్లాలో కోర్టుల సముదాయిక భవనాన్ని నిర్మల్ పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలో చించోలి గ్రామ శివారులో స్థలం ఎంపిక చేయడంపై జిల్లాలో న్యాయవాదులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు పరిపాలన న్యాయం అందించి న్యాయవ్యవస్థ పట్టణంలో కాకుండా సుదూర ప్రాంతాల్లో నిర్మించడం వల్ల అర్జీదారులు కక్షిదారులు న్యాయవాదులకు ఇబ్బందులు ఏర్పడతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉన్న నాలుగు కోట్లకు నిర్మల్ ఆర్మూర్ బైంసా ఖానాపూర్ బాసర సోన్ లోకేశ్వరం తదితర ప్రాంతాల నుంచి నిర్మల్కు చేరుకొని ఇక్కడి నుండి కోర్టుకు వెళ్లాలంటే మళ్లీ ప్రైవేటు వాహనాలను ఆశ్రయించడం వల్ల ఆర్థిక భారం అవుతుందని న్యాయవాదులు తెలిపారు.

కోర్టు సముదాయిక భవనాన్ని నిర్మల్ పట్టణంలోనే నిర్మించాలని నిర్మల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మల్లారెడ్డి ఆధ్వర్యంలో నిర్మల్ భైంసా ఖానాపూర్ న్యాయవాదులు తీర్మానం చేసి అధికారులకు ప్రజాప్రతినిధులకు ఉత్తరాలు రాశారు. ఇప్పటికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కోర్టు సముద్రయ్యక భవనాల నిర్మాణ స్థలం ఎంపికపై ప్రభుత్వం పునరాలోచన చేసి ప్రజలకు సౌకర్యంగా ఉండే ప్రదేశాల్లో నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఉన్న కోర్ట్ భవనంలోని స్థలం ఎంపిక చేయండి

పెరిగిన అవసరాలకు అనుగుణంగా కోర్టు సముదాయిక భవనాలు నిర్మించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేస్తూనే ప్రజలకు న్యాయవాదులకు అందుబాటులో ఉండే విధంగా చూడాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం నిర్మల్ కోర్టు నిర్మల్ పట్టణంలోని కోర్టు స్థలంలో వివిధ కోట్లు ఏర్పాటు చేశారు జిల్లా కోర్టును పాత ఇరిగేషన్ కార్యాలయంలో తాత్కాలిక పద్ధతిపై నిర్వహిస్తున్నారు.

ఈ ప్రాంతంలో మూడున్నర ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని దీనికి తోడు పాత రెవిన్యూ కార్యాలయం కూల్చివేయడంతో ఆ స్థలాన్ని ఉపయోగించుకుని ఐదు ఎకరాల స్థలంలో  భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిర్మల్ న్యాయవాదులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.

న్యాయమూర్తులు ఉండే గెస్ట్ హౌస్ లను రెసిడెన్షియలను అవసరమైతే కొండాపూర్లో నిర్మించి సముదాయక భవనం మాత్రం నిర్మల్  పట్టణంలో పాత కోర్టుల ప్రదేశంలోనే నిర్మిస్తే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందని న్యాయవాదులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఏ మేరకు స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.